ఈ పుట ఆమోదించబడ్డది

చెప్పగా, మనిషి ఆ మహావ్యక్తి చెప్పిన అమూల్యమైన మాటలను అర్థము చేసుకోలేక తప్పుగా అర్థము చేసుకొని తప్పుగా నడుస్తున్నాడు. ఆయన బోధించిన బోధలో ఒక్క ప్రళయము అను మాట అర్థము కాకపోవడము వలన, ఆయన భావమునకు ఎంతో దూరముగా మనిషి పోయాడు. నీ భావము తప్పు అని ఇప్పుడు అర్థమైందా వహీద్‌, దేవుడు చెప్పిన రెండు ప్రళయములో ప్రవక్తగారు చెప్పిన ప్రళయమేదో తెలియనివారు మిగత ఆయన మాటలను సరిగ అర్థము చేసుకొన్నారని నమ్మకమేమి?


దేవుడు సమాధినుండి లేపుతాడని చెప్పిన ప్రవక్తమాట నూటికి నూరుపాళ్ళు నిజమే. అయితే సమాధి అంటే మనిషి శరీరము కనిపించకుండ కప్పియున్నదని అర్థము. శరీరము కనిపించకుండ కప్పియున్నది భూమిలో తీయబడిన గుంత అనుకోవడము సరియైనదో కాదో యోచించండి. ఇలా ఎన్నో విషయములను మనము అర్థము చేసుకోలేక పోయాము. దేవుడు చనిపోయిన సర్వ మానవులకు సమాధిని సమానముగా ఉంచాడు. ఆ సమాధిని ప్రవక్తగారు చెప్పినా మనము అర్థము చేసుకోలేక పోయాము. మీరు అనుకొన్నట్లు భూమిలో పూడ్చిపెట్టిన వానికి సమాధి ఉంటుంది. కానీ అగ్నిలో కాలిపోయిన వారికి గానీ, నీటిలో మునిగిపోయిన వారికి గానీ, సమాధి ఉండదు కదా! ఖురాన్‌లోని దేవుని వాక్యము పొల్లుపోదు. దాని ప్రకారము అగ్నిలో కాలిపోయిన వానిని గానీ, నీటిలో మునిగి కుళ్ళి పోయిన వానిని గానీ చివరిలో దేవుడు సమాధినుండే లేపుతాడు. దీనినిబట్టి దేవుని వాక్యము నూటికి నూరుపాళ్ళు సత్యము.


ముస్లీమ్‌లు ప్రవక్త చెప్పిన మాటలను సరిగ అర్థము చేసుకోలేనట్లు, క్రైస్తవులు ప్రభువు చెప్పిన వాక్యములను అపార్థము చేసుకొన్నారు. అలాగే హిందువులు కృష్ణుడు చెప్పిన భగవద్గీతను ఎంతో తప్పుగా అర్థము చేసు