ఈ పుట ఆమోదించబడ్డది

ప్రజలకు తెలియదా! స్వంత కుమారులే రాముణ్ణి ఒప్పుకోలేదని ప్రజలకు తెలియదా! ఆ సందర్భములోనే సీత అక్కడికి వచ్చినపుడు, లవకుశులు తన కుమారులేనని తెలుసుకొన్న రాముడు, సీతను తిరిగి అయోధ్యకు పిలువగ, నీ చేతిలో అవమానముపాలై అడవిలో విడువబడిన తర్వాత కూడ తిరిగి వచ్చి నీతో నేనెలా కాపురము చేసేదని, అట్లు చేయుటకంటే చావడము మేలని, సీతాదేవి కొండమీదినుండి దూకి ఆత్మహత్య చేసుకోవడము ప్రజలకు తెలియదా! అంతవరకు ప్రాణాలతోవున్న ఆమె ఆ దినమే ఎందుకు లేకుండ పోయిందో తెలుసా? అప్పటి వరకు అడవిలో ఒక అభాగ్యురాలిగ బ్రతికిన సీత, ఇక మీదట రాముని భార్యగ బ్రతుకదలచు కోలేదు కనుక, తిరిగి రాముని భార్యననిపించుకోవడము ఇష్టము లేదు కనుక, ప్రేమలేని రాముని వద్ద బ్రతకడము నరకము కనుక, ఇదంతా ప్రజలకు తెలియదా! తెలిసిన తర్వాత కూడ రాముణ్ణి దేవునిగ, నన్ను రాక్షసునిగ వర్ణించి ప్రజలను తప్పుదోవ పట్టించిన కవులు ఏ పాటివారో మీరే యోచించండి.


అపరబ్రహ్మననీ, బ్రహ్మజ్ఞానిననీ, రావణబ్రహ్మననీ పేరుగాంచిన నాకు యజ్ఞములంటే ఏమిటో తెలియదా! బాహ్యయజ్ఞములు ధర్మ విరుద్ధములని, దేవుని మార్గమునకు ఆటంకములని, అధర్మములైన యజ్ఞములను చెడగొట్టిన నేను ధర్మపరుణ్ణా లేక యజ్ఞములను కాపాడ దలచిన రాముడు ధర్మపరుడా! అధర్మములను త్రుంచివేయుటకు దేవుడు భూమిమీదకు వస్తానని గీతలో చెప్పలేదా! ద్వాపరయుగములో గీతయందు యజ్ఞముల వలన నేను తెలియబడనని చెప్పిన ధర్మము ప్రకారమే నేను త్రేతాయుగములోనే, అధర్మములైన యజ్ఞములను నాశనము చేశాను. అనాడే ధర్మపరుణ్ణి, బ్రహ్మజ్ఞానిని అనిపించుకొన్నాను. భగవద్గీతకు అనుకూలముగ