చూడు, ఎట్లా పనులు చేసుకుంటూ సంపాదించుకొని ఎలా బ్రతుకుతున్నారో, మానవుడై పుట్టినందుకు సిగ్గు మానముండాలిరా.
వేణు :- నాయనా! నేనేమి అల్లర చిల్లరగా తిరగలేదుగదా! భక్తీ, జ్ఞానము, యోగాల గురించి తెలుసుకుంటున్నాను. అది తప్పంటే ఎట్లా.
కాటమయ్య :- తప్పే లేదంటావా తప్పుడునాయాలా.
తె॥గీ॥ | ఇంత జెప్పిన విన నీ ఇచ్చరీతి | |
వేణు :- నాన్నగారు ఆస్థి, ఐశ్వర్యం అశాశ్వితమైనవి, పోయేటప్పుడు ఏమైనా వెంటగట్టుకొని పోతామా, అలానే కానివ్వండి. ఆస్థిపాస్థులు కర్మానుసారంగా కలుగుతాయి, కానీ జ్ఞానం మాత్రము శ్రద్ధానుసారంగా కలుగుతుంది. మీ నిర్ణయమదే అయితే జ్ఞానంకోసం వేటినైనా విడచేదానికి సిద్ధంగా ఉన్నాను.
కాటమయ్య :- అలాగైతే నీవన్నిటికి తెగించి ఉన్నావన్నమాట. పో! నీ ముఖమింక నాకు చూపించద్దు.
--పాట--
ప॥ | పోపోర పొమ్మికన్ నీ ముఖమునాకింక చూపించ | |
చ॥ | తల్లిదండ్రుల మాటలు వినక | |