ఈ పుట ఆమోదించబడ్డది

బ్రహ్మ బిరుదాంకితుడనై, రావణ బ్రహ్మయని పేరుగాంచిన నన్ను, ఒక అసురునిగా భావించి, రావణాసుర అని పిలుచు ఈ కలియుగ వాసులను మూర్ఖులనాలో లేక మూఢులనాలో నాకే అర్థముకాలేదు.

నాలో అసురత్వమున్నదా?..........అజ్ఞానమున్నదా?....... అధర్మమున్నదా?..... అహేతుకమున్నదా?..... ఏమి చూచి నాకు రావణాసుర అని రాక్షస పేరు పెట్టారు?

అహర్ణిశలు ధర్మచింతనా పరుడనై... కర్మయోగా అనుష్టుడనై.... ధర్మకార్యాచరుడనై.... వేదఘోష వ్యతిరేఖినై.... యజ్ఞయాగాదుల బద్ద శత్రువునైన నన్ను.... అసురా! రావణాసురా! అని పిలుచు ఈ మూర్ఖ మూఢ మానవులకు మీరే కాదు నేనుకూడ బుద్ధి చెప్పవలసిందే.

త్రేతాయుగములోనే నేను యజ్ఞములను వ్యతిరేఖించాను. వేద పఠనములను వ్యతిరేఖించాను. వాటిని అచరించు వారిని ముప్పుతిప్పలు పెట్టి మాన్పించాలని చూచాను. యజ్ఞముల విషయములోనే మొదట పిల్లవాడైన శ్రీరామునితో శత్రుత్వము పెంచుకొన్నాను. నేను ఎంత వ్యతి రేఖించినా, మనుషులు మాయప్రభావితులై యజ్ఞముల నుండి బయటికి రాలేకపోయారు. ఆనాటి ఆర్యులైన వారు నన్ను దుర్మార్గునిగా, స్త్రీలోలునిగా, కామాంధముతో సీతను అపహరించిన వానిగా ప్రచారము చేశారు. నా వయస్సు 90 సంవత్సరములుండగా, నాకు మనువరాలు వయసున్న సీతను కోరినానని దష్‌ష్ప్రచారము చేశారు.

ద్వాపరయుగములో స్వయముగా భగవంతుడే వచ్చి యజ్ఞములు బాహ్యముగా చేయునవికావు, దేహములోనే రెండు రకముల యజ్ఞములు ఉన్నాయని చెప్పినా, బాహ్యయజ్ఞముల వలన దేవుణ్ణి చేరలేరని చెప్పినా, ఆయన మాటలను మనుషులు ఖాతరు చేయలేదు. సాక్షాత్తు దేవుడేయైన