ఈ పుట ఆమోదించబడ్డది

ముఖ్యముగా చెప్పునదేమనగా! మీకు దొరికిన కొంత జవాబుతోనే గోడకట్టుకొని కూర్చోకండి. ఎక్కడ ప్రశ్నరాని జవాబు దొరుకునో, ఎప్పుడు ఎవరూ ఎదురాడని జ్ఞానము దొరుకునో, అప్పుడే దేవుడెవరో తెలియబడును. కానీ, ఇప్పటి కాలములో దేవుడే దిగివచ్చి, ఈ కృష్ణునిగా చెప్పినా వినక నాది ఫలానామతమని, నామాటే వినవలెనని అనుకొనుచుందురు. అట్టివారు వ్యర్థులగుదురు. మతాలకు అతీతముగా యోచించండి. మతము హద్దులో మాట్లాడకండి. దేవునివద్దకు చేరడానికి మతములో మార్గము దొరకదు. మతాతీతునివైనపుడే మార్గము దొరకగలదు.


నాకీ అవకాశమును కల్గించిన ఈ మాయ కృష్ణునికి, దేవదేవుడైన ఈయనకు నేను నమస్కరించుచున్నాను. నేను దేవుడుకాని కృష్ణునికి మ్రొక్కక, దేవుడైన కృష్ణునికే మ్రొక్కుచున్నాను. ఇదే నా సందేశము.

సృష్ఠికర్త, పరమాత్మ శ్రీకృష్ణునకు జై !!!

-***-


మూఢ పండితులు

అది ఒక యజ్ఞ కార్యక్రమము. అందులో కొందరు పండితులు యజ్ఞము చేయుటకు పూనుకొన్నారు. యజ్ఞము ప్రారంభమవుచున్నది. పండితులు వారివారి మంత్రోచ్చాటనలో నిమగ్నమైనారు. ఆ యజ్ఞము పేరు "భూ మాతా యజ్ఞము" అంతా హడావిడిగా ఉంది. అక్కడికి ఒక బిక్షగాడు వచ్చి అడుక్కుంటాడు. అక్కడి పండితులు బిక్షగాడిని కసురు కొంటారు. బిక్షగాడు మొండిగా ఉంటాడు. అంతలో ఒక హేతువాది వచ్చి మాట్లాడను మొదలుపెట్టును.


హేతువాది :- ఏమి మనుషులయ్యా మీరు? వాడు ఆకలికొని కడుపు