ఈ పుట ఆమోదించబడ్డది

దేవుడు. గీతలో నీముందు, నీ వెనుక, నీలోను ఉన్నానని అర్జునునితో చెప్పినపుడు అర్జునునికి అనుమానము వచ్చి, మాట్లాడువాడు కృష్ణుడుకాదని తలచి, నీవెవరని ప్రశ్నించినపుడు, నేను నీకంటికి కనిపించువాడను కానని స్వయముగ దేవుడే కృష్ణుని రూపమునుండి చెప్పాడు. ఆ దినము దేవుని రూపము అర్జునునికి మాత్రమే తెలియబడినది. ఎప్పటికైన అదియే భవిష్యత్‌ కాలమునకు నిదర్శనము. దీనినిబట్టి కృష్ణుని రూపే దేవుడైతే ప్రత్యేకముగా కనిపించనవసరము లేదు. కావున నేడు కృష్ణుడు, నేను దేవుణ్ణి కాదన్నమాట వాస్తవమే. అమ్మపరాశక్తి నేను దేవుణ్ణి కాదన్నమాటా వాస్తవమే.


కొందరు మనుషులు దేవుణ్ణి కృపామయుడు, ప్రేమమయుడు అంటున్నారు. ఆ మాట వాస్తవమా అని పరిశీలిస్తే, ‘కృప’ అనగా ‘దయ’ అని అర్థము. దయగాని, ప్రేమగాని ఇవి మానవుని తలలోని పండ్రెడు గుణములలో వేరువేరు రెండు గుణములు. దేవుడు గుణాతీతుడు అన్న సూత్రము ప్రకారము, దేవుడు ఏ ఒక్క గుణముగలవాడు కాదు. గుణము ఉంటే దానివలన కార్యము, కార్యము వలన కర్మ, కర్మవలన జన్మ తప్పక వస్తుంది. దేవుడు గుణములకు, కార్యములకు, కర్మలకు అతీతుడు కావున ప్రేమమయుడు, కృపామయుడు అన్న వాక్యము కూడ అతనికి సరిపోదు.


ఇకపోతే కొందరు దేవుడు పరలోకములో ఉన్నాడన్నారు. ఆ మాటను వివరిస్తూ, పరలోకము పైన ఆకాశములో ఉన్నదని, అక్కడినుండి దేవుడు తన దూతలను పంపి దేవుని విషయమును వారిద్వారా చెప్పించునని అంటున్నారు. పరలోకము ఎక్కడున్నది? ఎంతదూరములో ఉన్నది వారికే తెలియదు! ఎక్కడో ఉన్నాడంటే ఇక్కడ లేడనే కదా అర్థము? ఇక్కడ లేని వానిని, అక్కడ మాత్రమున్నవానిని కొంత ప్రదేశానికే పరిమితి చేయవచ్చును. ఈ మాటప్రకారము దేవుడు పరిమితుడగును. దేవుడు అప్రమేయుడు,