ఈ పుట ఆమోదించబడ్డది

చూస్తే హిందూసమాజములో అధర్మములు పూర్తి చెలరేగి పోయాయి. అధర్మములను అణచివేయుటకు నేడు ఇందూ ధర్మప్రదాత, సంచలనాత్మక రచయిత, త్రైత సిద్ధాంత ఆదికర్త శ్రీశ్రీశ్రీ ఆచార్య ప్రబోధానంద గురువుగారు వస్తే, మీ స్వార్థబుద్ధితో అద్వైతము హిందువులదని, త్రైతము ఇతర మతస్థులదని నమ్మించారు. ఆదిశంకారాచార్యుని అద్వైతము పూర్తిగా తప్పని పూర్వము నాలాంటి చండాలుడు వాదించి గెలిస్తే, ఆనాడు శంకరా చార్యుడే చండాలుని కాళ్ళుపట్టుకొని నమస్కరించి ఓడిపోయానన్నాడు. ఆ విషయము బయటికి తెలిస్తే బాగుండదని, శివుడు చండాలుని వేషముతో వచ్చియుంటే, శంకరాచార్యుడు ఆయన కాళ్ళకు నమస్కరించారని కప్పిపుచ్చుకున్నారు. ఇప్పటికైన వేదాలు మన ప్రమాణ గ్రంథములుకాదు భగవద్గీత మన ప్రమాణ గ్రంథమని నమ్మి జ్ఞానమును తెలిసి హిందూత్త్వ ధర్మములేవో ప్రజలను తెలుసుకోనివ్వండి.


ఇంతచెప్పినప్పటికి అసూయతో అర్థము చేసుకోలేకపోతే నీవు ఎప్పటికి మాదిగవానివే. చెప్పింది అర్థము చేసుకొని ఆచరిస్తే నిజమైన బ్రాహ్మణునివవుతావు. నమస్తే.

-***-


ఎవరు దేవుడు

ఎల్లయ్య, గిరి అను ఇద్దరు భక్తులు స్టేజిమీద దేవుని గురించి వాదోపవాదములు చేయుచుందురు. ఎల్లయ్య, "ఆదిపరాశక్తియే దేవుళ్ళందరికి పెద్దయనీ, ఆమెవలననే త్రిమూర్తులైన విష్ణు, ఈశ్వర, బ్రహ్మలు పుట్టారనీ, దేవతలందరికీ పెద్ద ఆదిపరాశక్తియే" అని వాదించుచుండును. గిరి "దేవుడు పురుషునిగానే ఉండును, స్త్రీ ప్రకృతి స్వరూపిణి. అందువలన