ఈ పుట ఆమోదించబడ్డది

వారికి శైవులని పేరు కరిపించవద్దు. అలా చేయడము వలన భయంకరమైన పాపమువస్తుంది.

నారాయణబట్టు :- యమధర్మరాజా! నన్ను విష్ణుసన్నిధికి పంపించు. భూలోకమునకు వద్దు. నన్ను దయచూడు.

యమధర్మరాజు :- నీవు పరమమూర్ఖునివి, నేను సమవర్తిని. మీవలె నాకు దయాగుణముండదు. నాకు దయలేకున్ననూ, నా ధర్మము ప్రకారము నేను నిన్ను పంపునది విష్ణుసన్నిధికే. విష్ణుసన్నిధి భూలోకములోకాక ఎక్కడున్నదను కొన్నావు? నీవనుకొను అన్నీ లోకములు భూమిమీదనే ఉన్నాయి. ఇకనైనా భక్తితో రాజకీయపార్టీలాంటి వైష్ణవమును వీడి ఆత్మజ్ఞానమును తెలుసుకొనుటకు ప్రయత్నించు. (యమధర్మరాజు ఆత్మజ్ఞాని వైపు చూచి) నా ముఖాననున్న మూడు విభూతిరేఖలకు అర్థము తెలిసిన ఆత్మజ్ఞానీ! నీవు ‘‘మాయ’’ను జయించి ‘‘యమా’’ను మెప్పించావు. నీకు కర్మనునది ఏమాత్రము లేదు. కర్మయోగము వలన నీకర్మ అంతయు కాలిపోయినది. నీకు జన్మరాహిత్యము తప్ప జన్మ సాహిత్యములేదు. నీ వలన భూమిమీద జ్ఞానదీపము వెలిగినది. నీ జ్ఞానమును అర్థము చేసుకోలేక నిన్ను దూషించిన వారంతయు క్షమించరాని పాపమును మూటగట్టుకున్నారు.

ఆత్మజ్ఞాని :- యమధర్మరాజా! నాదొక మనవి. భూమిమీద అజ్ఞానము సాధారణ మనుషులలో లేదు. సామాన్యులు, జ్ఞానము తెలియని అమాయకులేగానీ, అజ్ఞానులుకాదు. జ్ఞానులమనుకొని మచ్చుకైన శరీరములోని ఆత్మజ్ఞానమును తెలియక బాహ్యముగా అనేక పేర్లతో, అనేక అరాధనలతో, అనేక సమాజములుగా, అనేక స్వాములుగా, అనేక బాబాలుగా ఉన్నవారే అజ్ఞానులుగా ఉన్నారు. వారు చెప్పు బోధలలో దేవునికి,