ఈ పుట ఆమోదించబడ్డది

వీరు ఇద్దరు అలాంటి చిన్నమ్మగంటుగలవారే. ఆధ్మాత్మిక గురువుల మని పేరుపెట్టుకొని, ఆత్మను ఏమాత్రము ఆరాధించక, తెలుసుకోక, లోపలి ఆత్మధ్యాసను వదలి బయటి దేవతలను ఆరాధించుచున్నారు. దేవతల ఆరాధనలు ప్రకృతి జనిత కోర్కెలను కల్గించగా, ఆ కోర్కెల విధానముతోనే ఆదిలో పుట్టిన అసలైన దైవత్వములను చెడగొట్టి, దైవజ్ఞానమును శైవము, వైష్ణవము అని చీల్చివేశారు. శైవ గురువులు భూమిమీద పుట్టకముందు నుండి నేను విభూతిరేఖలు ధరించుచున్నాను కదా! వీరి లెక్కలో నేను కూడా శైవుడనా? వైష్ణవములేని రోజుల్లోనే నామమును ధరించిన వారెందరో ఉన్నారు కదా! వారు అప్పుడు వైష్ణవులా? వీరు దేవతలు, దేవతలపార్టీల మాయలోపడి, మాయకు తిరుగబడి ‘‘యమా’’ అని పేరు కల్గిన నన్ను కూడ శైవుడన్నందుకు నీలకంఠాచార్యుణ్ణి, విష్ణువును కూడ వైష్ణవుడన్నందుకు, నారాయణబట్టును భూమిమీద పుట్టించి, 90 సంవత్సరములు వృద్ధాప్య యములో అనేక కష్టములు, అనేక అనారోగ్యములతో బాధ పడునట్లునూ, యౌవనములో వైష్ణవ, శైవ తెగల తగాదాలతో పోట్లాడుచు అనేక సమస్యలతో సతమతమౌచు, దైవత్వ జ్ఞానము యొక్క గట్టు దొరకక కాలము గడుపునట్లు, వీరు సంపాదించుకొన్న చిన్నమ్మగంటును అనుభవించునట్లు శిక్ష విధించు చున్నాను.

నీలకంఠాచార్యులు :- యమధర్మరాజా! ఇది చాలా అన్యాయము. నేను నా జీవితమంతయు శంకరభక్తుడనై, వీరశైవుడనై బ్రతికాను. నేనేమి తప్పు చేయలేదు. నన్ను కైలాసానికి పంపించు, భూలోకానికి పంపవద్దు.

యముడు : -(బిగ్గరగా నవ్వుచూ!) ఓరీ మూర్ఖుడా! కైలాసము ఉన్నది భూమిమీద కాదా? యమలోకము మొదలగు నీవు అనుకొను లోకములన్నీ భూమిమీదనే ఉన్నవి. ఇకమీదట శైవము అనుమాట లేని కాలములోనున్న