ఈ పుట ఆమోదించబడ్డది

776. జ్ఞానములు రెండు రకములు గలవు. ఒకటి ప్రకృతివైపు నడిపించును, మరొకటి పరమాత్మవైపు నడిపించును. నీవు ఏ జ్ఞానములో ఉన్నావో చూచుకో.

777. దినమునకు 12 గంటల పగటికాలము లేక 720 నిమిషములు, సెకండ్లయితే 43,200 అగును. ఒక సెకనుకు పదింతల ఎక్కువ కాలమును 4,32,000 సూక్ష్మకాలము అంటాము. ఒక దినమునకు కాలముతో పాటు శరీరములో 4,32,000 మార్పులు జరుగుచుండుటవలన కొంత కాలమునకు నీ శరీరము ముసలిదగుచున్నది.

778. మనిషికి గల బుద్ధి, ప్రపంచ సంబంధ వివరమునూ, పరమాత్మ సంబంధ వివరమునూ అందించుచుండును. మనిషికి గల బుద్ధి కర్మను బట్టి ప్రపంచవిషయమును అందించగా, శ్రద్ధనుబట్టి దైవ విషయమును జీవునకు అందించుచుండును.

779. భూమి విూద కొన్ని వేల మంది బోధకులుండవచ్చును. కానీ అంతమందిలో గురువులేకుండవచ్చును, ఉండవచ్చును. 780. గురువు అరుదుగా భూమివిూదకు వస్తాడు. కావున ఆయన ఏ కాలములో ఉంటాడో చెప్పలేము.

781. కొంత తెలిసిన మనిషి, తాను ఇతరులకు బోధించి బోధకుడు కావలెననుకొనును. కొంత బోధ చెప్పుచున్న బోధకుడు తాను ఇతరులకు ఉపదేశమిచ్చి గురువు కావలెనని అనుకొనును.

782. మనిషి బోధకుడు కావచ్చును, కానీ గురువు ఎప్పటికి కాలేడు. ఎందుకనగా మనిషి నుండి గురువురాడు, గురువు నుండి మనిషి రాగలడు.