ఈ పుట ఆమోదించబడ్డది

ఇటు ఆత్మలోనూ అటు మాయలోనూ అంతటా సమానముగా ఉన్నాడు. అయినా ఆయన గొప్పతనమును ఎవరు గుర్తించలేకున్నారు.

731. ఆహార పోషక పదార్థములు నాల్గురకములని గీతలో చెప్పాడు. అవికాక ఏమి తినినా త్రాగినా అవి రెండు రకముల పదార్థములుగా ఉన్నవి. ఒకటి విషము, రెండవది ఔషధము.

732. కడుపులోనికి వేయు మూలపదార్థములు మొత్తము ఆరు కాగా, వాటిని పోషకపదార్థములనీ, విషపదార్థములనీ, ఔషధ పదార్థములనీ మూడు రకములుగ విభజించవచ్చును. ఈ మూడురకముల పదార్థములు ఆత్మవిూదనే పని చేయుచున్నవి.

733. మనిషి పదార్థములను తింటున్నాడు, కానీ ఏది ఏ పదార్థమైనది కొన్నిటిని తెలిసి తింటున్నాడు. కొన్నిటిని తెలియక తింటున్నాడు. అవన్ని వాని కర్మానుసారమే లభిస్తున్నాయి. తినేది త్రాగేది ఏదైనా కర్మానుసారమే దొరుకుచున్నవి.

734. ఒకే పదార్థమే రోగమున్నపుడు తింటే ఔషధముగ, రోగము లేనపుడు తింటే విషముగ పని చేయుచున్నది. కొన్ని పదార్థములు రోగమున్నపుడు తింటే విషముగ, రోగములేనపుడు తింటే పోషకముగ పని చేయుచున్నవి. ఇంకొక విచిత్రమేమిటంటే ఒకే పదార్థము ఒకనికి ఔషధముగ, మరొకనికి విషముగ పనిచేయుచున్నది. దీనినిబట్టి చూస్తే అన్నిటికి కర్మేకారణమని తెలియుచున్నది.

735. ప్రపంచ కార్యముల విూద శ్రద్ధ కర్మప్రకారమే ఉండును. కానీ పరమాత్మ సంబంధ (దైవసంబంధ) కార్యముల విూద