ఈ పుట ఆమోదించబడ్డది

725. ఒక మనిషి సొమ్మును మరియొక మనిషి వాని అనుమతి లేకుండ తీసుకొంటే లేక దోచుకుంటే అది పాపమవుతుంది. దేవుని సొమ్మును మనిషి తీసుకొంటే అది ఎంతపాపమౌనో.

726. ఒక గుడిలోని ఉండిలోనికి నీ డబ్బులు వేసి తర్వాత దానిని నీవు తీసుకుంటే ఆ గుడిలోని దేవునికి నీ విూద కోపము వస్తుంది. అలా జరిగిన సంఘటనలున్నాయి. కావున అసలైన దేవాది దేవుని విషయములో జాగ్రత్తగ ఉండాలి.

727. ఇప్పటికి 60 సంవత్సరముల పూర్వము తిరుపతి వెంకటేశ్వరుని సన్నిధిలో ఉండీలో డబ్బులు వేసి కొంత మిగుల్చుకొన్నందుకు ఆ వ్యక్తిని అరగంట తర్వాత వెంకటేశ్వరుడే శిక్షించాడు.

728. బయటి చదువులకు ఫీజులు చెల్లిస్తాము. లోపలి చదువు అయిన జ్ఞానమును దేవుడు అందిస్తే, చేతనైనది చేసేదో, ఇచ్చేదో చేయవలెను. లేకపోతే నీవు ఎన్ని జన్మలకైన ఆయనకు బాకీ ఉందువు.

729. విషము శరీరములోని ఆత్మనూ, విషయము శరీరములోని జీవాత్మనూ ఇబ్బంది పెట్టును. విషమును ఔషధము, విషయమును జ్ఞానము నిరోధించగలవు. విషములోని ప్రభావమును, ఔషధములోని నిరోధకశక్తి రెండు ఒకే పరమాత్మ వలన కలుగుచున్నవి.

730. దేవుడు ఇటు విషములోనూ అటు ఔషధములోను. ఇటు అగ్నిలోనూ అటు కట్టెలోనూ, ఇటు దేవతలోనూ అటు రాక్షషునిలోనూ, ఇటు జ్ఞానములోనూ అటు మూఢత్వములోనూ,