ఈ పుట ఆమోదించబడ్డది

656. ప్రాణాయామము నేర్చినవాడు బ్రహ్మయోగికావచ్చును. కానీ కర్మయోగి కాలేడు.

657. కర్మయోగిని ఎవరు గుర్తించలేరు. కానీ బ్రహ్మయోగిని అందరు సులభముగ గుర్తిస్తారు.

658. బ్రహ్మవిద్యను డబ్బుతోకొనలేము. కానీ ఒక్క శ్రద్దతో మాత్రమే దానిని సంపాదించవచ్చును.

659. జ్ఞానము కల్గిన పుస్తకములను డబ్బుతో కొనవచ్చును. కానీ ఆ పుస్తకములోని జ్ఞానమును శ్రద్దతో తప్ప డబ్బుతో తలకు ఎక్కించుకోలేము.

660. దుస్తులు శరీరమునకు అందమును చేకూర్చినట్లు ఆత్మజ్ఞానము జీవునకు ఆనందమును చేకూర్చగలదు.

661. తినేదానికి బ్రతకడము, బ్రతికేదానికి తినడము జీవితముకాదు.

662. దైవజ్ఞానము కల్గిన జీవితము గొప్పకార్యములాంటిది. దైవజ్ఞానము లేని జీవితము వృథాకార్యములాంటిది.

663. ఆత్మానందమును తప్ప మరి ఏ ఇతర ఆనందములను గొప్పగ తలవవద్దు.

664. దినములో ఉదయకాలము, మధ్యకాలము, సాయంకాలము ఉన్నట్లు మనిషి జీవితములో పుట్టడము, పెరగడము, చావడము కలవు.

665. భూమి విూద ఎవరైన గురువులుగ, స్వావిూజీలుగ, బాబాలుగ చలామణి కావచ్చును. వీరిని ఎవరూ కాదనరు. కానీ