ఈ పుట ఆమోదించబడ్డది

589. నేరము ఏదైన దానిఫలితము పాపమే అవుతుంది. పాపము ఏదైన దాని ఫలితముగ జీవునకు బాధ కలుగుచునే ఉండును.

590. జరిగిపోయిన కాలములోని నేరస్థుడు, జరుగుచున్న కాలములో రోగస్థుడు. జరుగుచున్న కాలములోని నేరస్థుడు, జరుగబోవు కాలములో రోగస్థుడు అవుతాడు.

591. చేయుచున్న నేరము ముందే ప్రకృతిచే నిర్ణయమైన పతకము లోనిదే. ఎవడు స్వయముగ చేయలేదు. కానీ తానే చేశానని అనుకోవడము వలనే రోగమును పొందవలసివచ్చినది.

592."జాగ్‌" అనగ మేలుకోవడము లేక మెలుకువ కల్గియుండడము, "గత్‌" అనగ గడచిపోయినదని అర్థము. జాగ్‌+గత్‌=జాగ్గత్‌ అయినది. కాలక్రమమున రూపాంతరము చెంది జాగ్రత్‌ అయినది. దానినే జాగ్రత్త అనికూడ ఉచ్ఛరించుచున్నాము.

593. గడచిపోయిన పుట్టుకను గురించి తలచుకొని, రాబోవు చావును గురించి మెలుకువ కల్గియుండవలెను.

594. తన చావును తాను జ్ఞప్తి చేసుకొనువాడు జాగ్రత్త కల్గినవాడు. తన చావును మరచినవాడు అజాగ్రత్తపరుడు.

595. నాకు ఎన్నో పుట్టుకలు, ఎన్నో మరణములు గడచిపోయాయి. అవన్ని నాకు తెలియవు. నాకు తెలిసినది, ప్రస్తుతము నేను జన్మించియున్నాను. ఇక వచ్చేది మరణమే. దానిని గురించి నేను మెలుకువగానే ఉన్నానని జ్ఞాని అనుకొనుచుండును.

596. స్త్రీ అవివాహితగా ఉన్నపుడు ఇద్దరు భర్తలు కల్గియుంటుంది. వివాహమైన తర్వాత ముగ్గురు భర్తలు కల్గియుంటుంది.