ఈ పుట ఆమోదించబడ్డది

571. లోపలి జ్ఞానము తెలియకనే, బుద్ధుడు బయటి భార్యా పిల్లలను వదలి పెట్టి పోయాడు.

572. నీ అన్న ఆత్మ, నీ తండ్రి పరమాత్మ ఉన్నది నీశరీరములోనే అని మరువద్దు.

573. భౌతిక శాస్త్రమును తెలిసినవారికి శరీరములోని ఎముకలు, కండలు, మెదడు, రక్తము మాత్రమే కనిపించును. కానీ మనస్సు, బుద్ధి, చిత్తము, అహములు ఏమాత్రము కనిపించవు.

574. శరీరములో భాగములైన మనస్సు, బుద్ధి, చిత్తము, అహము అనునవే ఎవరికి కనిపించనపుడు, శరీర భాగములుకానటువంటి జీవాత్మ, ఆత్మ, పరమాత్మ ఎలా కనిపించును?

575. వ్యాసుడు 18 పురాణములను, 6 శాస్త్రములను వ్రాశాడు. కాని వాటిలో కొన్నిటిని చెప్పి వ్రాయించినవాడు వ్యాసుని శరీరములోని ఆత్మని తెలియవలెను.

576. వ్యాసుని శరీరము నుండి ఆత్మ 18 పురాణములను, 5 శాస్త్రములను మాత్రమే వ్రాయించినది. ఆరవ శాస్త్రమును ఆత్మ స్వయముగ వ్రాయలేదు.

577. పరమాత్మ తెలుపగ ఆత్మగ్రహించి శరీరముతో దానినే వ్రాయించినది. అదియే ఆరవ శాస్త్రమైన బ్రహ్మవిద్యాశాస్త్రము.

578. ఆత్మకు కూడ తెలియని ఆరవ శాస్త్రమును మనిషి నాకు తెలుసుననుకోవడము అజ్ఞానము కాదా?

579. ఆత్మ నుండి తెలిసిన సిద్ధాంతమును నేను కనిపెట్టానని చెప్పుకోవడము అహము కాదా?