ఈ పుట ఆమోదించబడ్డది

544. అయమాత్మ బ్రహ్మ అంటే ఆత్మకంటే వేరుగనున్నానను పరమాత్మ మాటయొక్క అర్థమే తప్పగును.

545. నీ ప్రక్కనున్నవాడు ఆత్మ, నీ చుట్టూ ఉన్నవాడు పరమాత్మ, ఒక్కచోటున్న నీవు జీవాత్మవు.

546. నఖలు, శిఖలు రెండు ఆత్మకు చిహ్నములు, ముఖము ఒక జీవాత్మకు గుర్తు.

547. భయమూ ధైర్యమూ రెండూ శరీరములోనే ఉన్నాయి. రెండూ గుణములలాంటివే.

548. భయమును శరీరములోపల నీవే లేకుండ చేసుకోవలెను. అంతేకానీ బయటి దేవతలు నీ భయమును లేకుండ చేయలేరు.

549. గుడిలో దేవతలు హస్తమును చూపునది నీ హస్తమును నీవు చూచుకొమ్మని. కానీ అది అభయహస్తము కాదు.

550. వాయువుతో కూడుకొన్నది ఆయువు. అందువలన వాయువైన శ్వాస ఉన్న కాలమునే ఆయువు అంటున్నాము.

551. నీ తల్లి ప్రకృతి, నీ తండ్రి పరమాత్మ నీతోపాటు పుట్టినవారందరు జీవుళ్ళు. అందువలన అందరు నీకు సోదరులు సోదరీలుగా ఉన్నారు. ఈ విషయమునే అందరికి తెలియునట్లు పెళ్లి దినము నిన్ను పెళ్లికొడుకు అట్లే నీ భార్యను పెళ్లి కూతురు అంటున్నారు.

552. పుస్తకము, మస్తకము (తల) రెండు సమాచార నిలయములే.

553. పుస్తకములో ఏ సమాచారమైన ఉండవచ్చును. అట్లే మస్తకములో ఏ సమాచారమైన ఉండవచ్చును.