ఈ పుట ఆమోదించబడ్డది

518. ముందే నిర్ణయించుకోవడమును "పథకము" అంటాము. పుట్టినపుడు నిర్ణయించబడిన దానిని "జాపథకము" అంటాము. జాపథకము అనునదే నేడు జాతకము అను పేరుతో కలదు.

519. అద్వైతులు విశిష్టాద్వైతులు, ద్వైతులు ఆత్మను మరిచారు. పరమాత్మను జీవాత్మను గురించే మాట్లాడారు.

520. పరమాత్మనూ జీవాత్మనూ కాక, ఆత్మ కూడ ఒకటి కలదని చెప్పినది ఒకేఒక త్రైతసిద్ధాంతము.

521. అద్వైతులు పరమాత్మను మాత్రము చెప్పగ విశిష్టాద్వైతులు పరమాత్మను కొంత విశిష్టముగ చెప్పారు. ద్వైతులు పరమాత్మను జీవాత్మను గురించి చెప్పారు.

522. ఆత్మను గురించి ప్రత్యేకించి చెప్పినది త్రైతసిద్ధాంతము ఒక్కటే.

523. ఒకే పరమాత్మను గురించి చెప్పినవారు అద్వైతులు, విశిష్టాద్వైతులు కాగ, పరమాత్మ, జీవాత్మ అను ఇరువురిని చెప్పినవారు ద్వైతులు కాగ, పరమాత్మనూ, జీవాత్మనూ, ఆత్మనూ ముగ్గురిని గురించి చెప్పినవారు త్రైతులు.

524. అవధులులేని సమాచారమును మోసుకొచ్చినవాడు అవధూత ఒక్కడే. అతను ఎప్పుడో ఒకపుడు భూమివిూదకు వస్తాడు. అతనే భగవంతుడు.

525. తామసులు, రాజసులు, సాత్త్వికులు, యోగులని మనుషులను నాల్గు తెగలగా గీతలో భగవంతుడు చూపగా, అదే మనుషులు అజ్ఞానులుగ, జ్ఞానులుగ, యోగులుగ, భగవంతునిగ నాల్గురకములుగా ఉన్నారని త్రైతసిద్ధాంత ఆదికర్త తెలుపుచున్నాడు.