ఈ పుట ఆమోదించబడ్డది

500. అన్నదానము ఆత్మకు, జ్ఞానదానము జీవాత్మకు చెందుతుంది.

501. అన్నదానము కర్మను బట్టి ఉండును. జ్ఞానదానము శ్రద్ధను బట్టి ఉండును.

502. ఆకలి బాధకు అన్నము అవసరమైనట్లు, విషయబాధకు జ్ఞానము అవసరము.

503. కడుపులో ఆకలిబాధ ప్రతి మనిషికి ఉన్నట్లే, తలలో విషయబాధ ప్రతి మనిషికి ఉండును.

504. కడుపులేని జీవరాసిలేనట్లు, తలలేని జీవరాసి కూడ లేదు.

505. కడుపు తల ఉన్నవారికందరికి ఆహారమును జ్ఞానమును దేవుడు తయారు చేసి ఉంచాడు.

506. మనిషి కడుపుకొరకు అన్నమునే వెదుకుకొనుచున్నాడు. కాని తలకొరకు జ్ఞానమును వెదుకుకోవడము లేదు.

507. రోమములు, ఈకలున్న మనుషులు, పక్షులు ఆత్మకు గుర్తుగ రోమములు, ఈకలులేని పాములు చేపలు మాయకు గుర్తుగ ఉన్నవి.

508. పెళ్లి అనగా దైవము అని అర్థము కాగా, వివాహము అనగా ఇద్దరికి వర్తించునదని అర్థము. ఈ అర్థములు ప్రపంచక నిఘంటులో ఉండవు. కేవలము పరమాత్మిక ఘంటులో ఉండును.

509. ఘంటు అనగ మూట, నిఘంటు అనగా ఉత్త మూట అని తెలుసుకో!