ఈ పుట ఆమోదించబడ్డది

473. అద్వైతుల పంచాక్షరియందో, విశిష్టాద్వైతుల అష్టాక్షరియందో ఏదో ఒక దానియందు తప్పుండునట్లు తెలియుచున్నది.

474. అద్వైతమునకు, విశిష్టాద్వైతమునకు, ద్వైతమునకుమించినది, శాస్త్రబద్దమైనది త్రైతసిద్ధాంతము.

475. విష్ణు, ఈశ్వర, బ్రహ్మలైన త్రిమూర్తులకు కూడ ఆకారములు పేర్లు గలవు. ఆకారముగాని, పేరుగాని లేనివాడే దేవుడు.

476. రూపనామ క్రియలులేని దేవుడు రూపనామక్రియలున్న త్రిమూర్తులను కూడ సృష్ఠించాడు. కావున మనకు దేవతలకు తండ్రి ఒక్క దేవుడే.

477. దేవుని దృష్ఠిలో దేవతలు, మానవులు అందరు సమానమే. దైవజ్ఞానము లేక పోతే దేవతలు కూడ దేవునికి దూరము కాగలరు.

478. దేవతలు గానీ, మనుషులు గానీ మహర్షి పదవినుండి బ్రహ్మర్షి హోదావరకు పోతేనే చివరకు దేవుడు తెలియును.

479. జ్ఞానమును బట్టి మానవునికి దైవమార్గములో గల హోదాలు మహర్షి, రాజర్షి, దేవర్షి, బ్రహ్మర్షి కాగ అజ్ఞానమును బట్టి ఒకే ఒక హోదాగలదు. అదియే బేవర్షి అనుపేరు.

480. మరణములు రెండు విధములు ఒకటి అకాలమరణము, రెండు కాలమరణము. అకాలమరణము పొందితే అదే జన్మమందు సూక్ష్మశరీరముతో జీవుడుండును. కాలమరణము పొందితే క్రొత్త శరీరమును మరుజన్మయందు పొందును.