ఈ పుట ఆమోదించబడ్డది

ముందుగా చెప్పునది


"ప్ర" అను అక్షరమునకు విశిష్టమైన అర్థమున్నది. పంచ భూతములను పంచ అని పిలుస్తు వాటి యందు "ప్ర" ను పెట్టడమైనది. దానితో ప్రలయము అయినది. ఇట్లు ఉన్నదానికి విశిష్టతను విశేషతను చేర్చునది "ప్ర" అని తెలియుము. అదే పద్దతిలో ఇచ్చట బోధకు "ప్ర" ను చేర్చడమయినది. దానితో ప్రబోధ అయినది. ప్రబోధ అనగ విశిష్టమైన బోధ అనియు, అన్ని బోధలకంటే ప్రత్యేకత ప్రాముఖ్యత గల బోధ అనియు తెలియుచున్నది. మేము చెప్పు బోధలో ప్రత్యేక త్రైత సిద్ధాంతము ఉండుట వలననే ప్రబోధ అని పేరు పెట్టడము జరిగినది. మా బోధలలోని సారాంశమైన కొన్ని వాక్యములను "ప్రబోధ తరంగాలు" అని పేరు పెట్టి వ్రాయడము జరిగినది. వేమన పద్యమందు ఎక్కువ అర్ధమిమిడినట్లు ప్రబోధ తరంగాలలో కూడ విశేష అర్ధముండునని తెలుపుచున్నాము.

భాషా ప్రావీణ్యత లేని ఈ వాక్యములలో భావ ప్రావీణ్యత ఎక్కువగా ఉండును. చాలా పుస్తకములలో పది పేజీలు చదివిన అందులో గుర్తింపదగిన విషయముండదు. చదువుటకు ఇంపుగా ఉండినప్పటికి అందులో గ్రహించవలసిన విషయము లేకపోవుటచే ఎంత చదవిన లాభముండదు. మా పుస్తకములలో అలా కాక ప్రతి పేజీలోను కొంత క్రొత్తవిషయమూ,గుర్తింపదగిన సారాంశముండును. అంతేకాక మేము చెప్పువిషయము ఇంకా సులభముగా అర్ధమగునట్లు, ఒక్కొక్క సారాంశమును ఒక్కొక్క వాక్యముగ వ్రాయడము జరిగినది. అలా వ్రాసినదే ఈ "ప్రబోధ తరంగాలు" అను గ్రంథము. ఈ పుస్తకములో ఏడు వందలకు పైగా వాక్యములున్నవి. ప్రతి వ్యాకము గొప్ప సందేశమై ఉన్నది.