ఈ పుట ఆమోదించబడ్డది

451. ఏ గుణములో మరణిస్తే అదే గుణములో పుట్టుచున్నావని గీతలో దేవుడు చెప్పాడు. కాని ఏ కులములో చస్తే ఆ కులములో పుట్టుదువని చెప్పలేదు.

452. పుట్టిన తర్వాత కొంతకాలమునకు తెలియునట్టి కులము, మతము మనుషులు కల్పించుకొన్నవే కాని జన్మతః వచ్చినవి కావు.

453. కులాలు కుచ్చితముతో, మతాలు స్వార్థముతో కూడుకొన్నవి. కులాలకు మతాలకు దేవుడు అతీతముగ ఉన్నాడని తెలిసి నీవు ఆ విధముగ మారినపుడే దేవుడు తెలియును.

454. ఉపనిషత్తులను దేవుడు చెప్పలేదు. మనుషులు వ్రాసుకొన్నవే ఉపనిషత్తులు. అందులో కూడ కొన్ని లోపములు గలవు.

455. ఉపనిషత్తులలో కూడ లేని విషయములను (ధర్మములను) దేవుడు తెలిపి తనదే గొప్ప జ్ఞానమనిపించుకొన్నాడు.

456. మొత్తము ఉపనిషత్తులు 1108 కాగ అందులో ముఖ్యమైనవి 108 మాత్రమేనని కొందరనుచున్నారు. ముఖ్యమైన ఆ 108 ఉపనిషత్తులలో కూడ భగవంతుడు చెప్పిన భగవద్గీత లేదు.

457. దేవుడు చెప్పిన జ్ఞానమును వదలి మనుషులు చెప్పిన ఉపనిషత్తుల మీద భ్రమపెంచుకోవడము చూస్తే దైవజ్ఞానము మీద నమ్మకము లేనట్లే!

458. బాహ్యములో ఇతరులతో సంబంధము లేకుండ అనుభవించ వలసిన కర్మలను స్వప్నములో అనుభవింతురు.