ఈ పుట ఆమోదించబడ్డది

భ్రమిస్తు తనవెనుకనున్న ఆత్మ పరమాత్మను గాని ప్రకృతిని గాని తెలియలేకపోవుచున్నాడు.

311. శరీరములో ఆత్మ ఎల్లపుడు ఒక్క క్షణము కూడ ఊరకుండక మేల్కొని పనిచేయుచుండగా, జీవాత్మ జరుగుచున్నదానిని కొంతసేపు చూచి అనుభవించి, కొంతసేపు చూడకుండ ఊరకున్నది. చూచి అనుభవించు కాలమును మెలుకువని, చూడక ఊరకుండు కాలమును నిద్రయని అంటున్నాము.

312. శరీరములో జీవాత్మ ఏమి తెలియని అన్నిరకముల అంధుడు కాగా, వానికి పంచ జ్ఞానేంద్రియములు అన్ని విషయములను తెలియజేస్తున్నవి.

313. శరీరములో తన నిజస్థితి తెలియని జీవాత్మ అన్నీ తానే తెలుసుకొనుచున్నట్లు, అన్నీ తానే చేయుచున్నట్లు భ్రమలో మునిగి ఉన్నాడు.

314. పరమాత్మ, ఆత్మ, జీవాత్మలను వరుస క్రమములో జీవాత్మ చివరిదైనా, మొదటి దానివలె భ్రమించుచున్నది.

315. ప్రతి మానవుని హస్తములో జీవాత్మ ఆత్మలనబడు రేఖలు కలిసియుండునట్లు, రెండిటికి పైన పరమాత్మ అనుబడు రేఖ ప్రత్యేకముగ ఉండునట్లు గర్భములోనే ముద్రించబడి ఉన్నవి.

316. పరమాత్మ విశ్వమంతట, ఆత్మ శరీరమంతట, జీవాత్మ తలలోని నుదుటి భాగములో సూది మొనంత వ్యాపించి గలవు.