ఈ పుట ఆమోదించబడ్డది

విషయములను చూపును. రెండవది దేవుని విషయమును చూపును. మొదటిది మనోనేత్రము, రెండవది జ్ఞాననేత్రము.

268. ప్రతి జీవునికి కర్మవలన సంభవించునవి మూడు కన్నులు కాగ శ్రద్దవలన సంభవించునది ఒకేఒక కన్ను అదే జ్ఞాననేత్రము.

269. మానవునికి మనోనేత్రము తెరుచుకొంటే జ్ఞాననేత్రము మూసుకొనును. జ్ఞాననేత్రము తెరచుకొంటే మనోనేత్రము మూసుకొనును.

270. ఏది జ్ఞాన నేత్రమో, ఏది మనో నేత్రమో మానవుడు సులభముగా గుర్తించలేడు.

271. జ్ఞాననేత్రము, మనోనేత్రము రెండు భగవంతునికి మాత్రము ఒకే సమయములో పనిచేయుచుండును.

272. దేశములో అత్యుత్తమమైన జ్ఞానము, అత్యుత్తమమైన అజ్ఞానము గలవు. ఏది ఎవరికి ఇష్టమో అదే లభించును.

273. దేశములో బోధకులెందరో కలరు. బోధకులందరూ గురువులవలె కనిపించుచుందురు. అయినప్పటికి దేశములో గురువు ఒక్కడే ఒకప్పుడే ఉండును.

274. ఒక్క రూపాయికి నూరు పైసలున్నట్లు దేశములో పైసా స్థాయినుండి 99 పైసల స్థాయి వరకు బోధకులుందురు. 100 పైసల (రూపాయి) స్థాయిలో గురువుండును.

275. గురువును గర్తించుట చాలా కష్టము. ఎందుకనగా ఒక్క పైసా స్థాయి నుండి 99 పైసల స్థాయివరకు కనిపించుచుండును.