ఈ పుట ఆమోదించబడ్డది

153. ఆత్మజ్ఞానం కలుగకపోవడమే జీవులకు అసలైన శిక్ష.

154. ఆత్మజ్ఞానమే కర్మలను సమిధల కాల్చు అగ్ని, ఆత్మజ్ఞానమే కర్మ జాడ్యాన్ని తీర్చు అమోఘ ఔషధము, ఆత్మజ్ఞానమే కర్మ మాలిన్యాన్ని కడుగు పరిశుద్ధజలము.

155. మధురమైన విషఫలాల వంటివి విషయసుఖాలు, అవి అనుభవించేటప్పుడు అతి మధురంగా ఉన్నా ఆ తరువాత అతి దారుణ ఫలితాలు కలిగిస్తాయి.

156. పుణ్యం కొరకు దానం చేస్తే సుఖం కొరకు జన్మ వస్తుంది.

157. నీవు చేయు దానం, యజ్ఞము, వేదపఠనము, తపస్సు అను నాలుగు విధానములవలన దేవున్ని తెలియుటకు సాధ్యముకాదని భగవద్గీతలో భగవంతుడు, మరియు పరమాత్మ తెలిపాడు.

158. ఇంద్రియాగోచరున్ని ఇంద్రియాతీతునివై గుర్తించాలి.

159. జ్ఞానము తెలిసేకొద్ది మనలో ఉన్న అజ్ఞానమెంతటిదో తెలియును.

160. మనిషికి గృహములాంటిదే జీవునికి శరీరము.

161. పిందె కాయగ, పండుగ మార్పు చెందినట్లు నీశరీరము కూడా యవ్వన, కౌమార, వృద్ధాప్యములలో మార్పు చెందుచున్నది.

162. చెట్టుఆకు రంగు మారిపోయినట్లు నీ శరీరము కూడా వృద్దాప్యములో రంగు మారిపోతుంది.

163. నీవు జాగ్రత్త, స్వప్న, నిద్రయను మూడవస్థలలో ఖైదీగా ఉన్నావు.

164. నీవు స్థూల, సూక్ష్మ, కారణమనెడి మూడు వస్త్రముల మధ్య చుట్టబడి ఉన్నావు.