ఈ పుట ఆమోదించబడ్డది

78. ఉపవాసాలూ, వ్రతాలతో వళ్ళు జెడుతుందిగాని, జీవా! అవి నిన్ను ఉద్ధరించలేవు. యోగాలతో ఊహించరానిస్థితిని అందుకోగలవు.

79. మాయను జయించిన వారే మహనీయులు, కానీ మాయతో కూడుకొన్న మాటలు చెప్పువారు కారు.

80. తపస్సుకు తపనకు కాలవ్యత్యాసమే తేడా, తపస్సు పెద్దకోరిక, తపన చిన్న కోరిక.

81. తపనలు, తపస్సులు వదిలినపుడే తత్త్వం గోచరిస్తుంది.

82. మనసును ఒకే విషయముపై నిలిపే అలవాటు చేస్తే తర్వాత అది ఆ విషయమునుండి మరలి వచ్చుట మహా కష్టమగును.

83. మనస్సు అనే చెట్టుకు విషయములను వేర్లు ఆధారము. వేర్లు తెగితే చెట్టు కూలిపోయినట్లు విషయములు ఖండించితే మనస్సు కూలిపోతుంది.

84. ఒక కోర్కె తీర్చుకొనేటప్పటికి పది కోర్కెలు నీలో ఆవిర్భవిస్తుంటే ఇంక కోర్కెలు తరిగేదెప్పుడు?

85. అజ్ఞాన జీవులకు ఆయుస్సు అయిపోతుంటే, ఆశలు పెరుగుతూ పోతున్నాయి.

86. బాహ్య సంసారాన్ని వర్జించినవాని కంటే లోపల సాంగత్యాన్ని వర్జించినవాడే సత్యమైన సన్న్యాసి.

87. ఎప్పుడు జ్ఞానం తెలుసుకోవాలని సంకల్పం కల్గుతుందో,