ఈ పుట అచ్చుదిద్దబడ్డది

96

ప్రభుత్వము

ప్రపంచమునే కబళించెదననుచున్నాడు. చీనాదేశచరిత్ర యందును 'కోమింటారిగ' నే మన కాంగ్రెసు బోటిసంస్థ సర్వాధారము కావడము మొదట సోషలిస్టుగానున్న షియాంగ్ కేషెక్కు, జపానుకు మిత్రుడుకావడానికి తరువాత నిరంకుశుడయి ప్రజలరాజ్యాన్ని ప్రజలచేతిలో పెట్టకుండా తనచేతిలోనే పెట్టుకొని చీనాలోని సోషలిస్టులను అణచి దేశబలాన్ని కృంగదీయడానికి జపాను పై బడివచ్చినప్పుడు చేసినతప్పు దిద్దుకొని గోరితోపోవుపనికి గొడ్డటితో ప్రయత్నింపవలసిన ఆవశ్యము సంభవించడానికి ఇన్నిటికీ దారిదీసినది.

ఇట్టియనుభవాలు లోకమునకు కలిగియున్నందుననే సర్వసన్యాసులు ప్రజాప్రభుత్వములోనే పరిపాలకులయ్యే సందర్భము కలిగినా వారుచెందిన పార్టీసంస్థగాక ప్రజలసంస్థలు రైతుసంస్థలు కార్మికసంస్థలు వగైరాలు ప్రచారములో ఉండడానికి సంపూర్ణావకాశా లుండవలెనని లోకమున నభిప్రాయము ప్రబలిపోయినది. ప్రభుత్వాంగనిర్ణయము చేయవలసివచ్చినప్పుడు ఇట్టిసంస్థల యభిప్రాయప్రకటన నై జరీతిని జరుగడానికి ఎన్నికల కీసంస్థలనే ప్రాతిపదికములుగా తీసికోవలసిన దని కోరువారును కలరు. ఇదివరలో వర్ణితమైన 'ఇనీషియేటివు', 'రెఫరెండము' వగైరా అధికారములు రాజ్యంగమునందు ప్రజల కేర్పడియుండి స్థానికపరిపాలన సమగ్రముగానుండి కార్మిక కర్ష కాదిసంస్థల వాత్స్వాతంత్ర్య, రచనాస్వాతంత్ర్య, సమావేశస్వాతంత్ర్యములు అరికట్టబడక యున్నయెడల ఇట్టి ప్రత్యేకసంస్థలకు ప్రత్యేక ప్రాతినిధ్యము ప్రసాదితము