ఈ పుట అచ్చుదిద్దబడ్డది

శాసననిర్వహణస్వరూపము

77

రాజ్యమేలవలెను. ఒక్క యారుమాసములేలిన పిదప మూడేడు లావ్యక్తి మరల అధికారము వహింపరాదు. ఇటలీ ఈమునిసిపలురాష్ట్రానికి సంరక్షణకర్త.

ప్రజాప్రబోధ మెక్కువగా కలదేశములయందు నామకార్థ మొక యుత్తమాధికారియున్నను నిజముగా నధికారమును నిర్వహించువారు ప్రజాప్రతినిధులేయగుటయు సంభవించియున్నది. ఆంగ్లభూమిలోను, పరాసుభూమిలోను, ఇట్టి పరిస్థితి ప్రముఖముగా కాననగుచున్నది. కాబట్టి కదలలేని మూలవిరాట్టుకుబదులు కదలికగల యుత్సవవిగ్రహములు సర్వాధికారమును తల ధరించుచున్నారు. అందుచేత నీయుత్సవవిగ్రహముల వర్ణన యవసరము. ఈ యుత్సవవిగ్రహముల కే మంత్రులని పేరు. వీనివర్గమునకే మంత్రివర్గమని పేరు.

ఉత్సవ విగ్రహములు

నేటి 'మంత్రివర్గ' పద్ధతికి ఆంగ్లభూమి పుట్టినిల్లు. ఈమంత్రివర్గము పేరు ఏశాసనములోనులేదు. కాని మంత్రివర్గమునకుగల బలము మరి రాష్ట్రములోని ఏయధికారికిని కానరాదు. ఇంతటి శక్తివంతమగు సంస్థ యెట్లేర్పడినదా యను శంకయక్కర లేదు. ఆంగ్లప్రజలు శతాబ్దములుగా దీనిని కట్టుకొని వచ్చినారు. ఆచరిత్ర వ్రాయగడంగిన నది యొకగ్రంథమగును. నేడుమంత్రివర్గ మెట్లేర్పడుచున్నదో యిచ్చట వర్ణించిన చాలును. ఆంగ్ల ప్రజలు ప్రతినిధిసభను ఎన్నుకొను చున్నారు. అందులో నేదో యొక కక్షికిచేరినవారు ఎక్కువ సంఖ్యాకులుగా నుందురు, ఆకక్షికి చెందినవారిలోనుండి యొక్కరను రాజు