ఈ పుట అచ్చుదిద్దబడ్డది

72

ప్రభుత్వము

మయినది. అధ్యక్షపదవికి పరోక్షనిర్వచనము పనికిరాదు. ప్రత్యక్షనిర్వచనమే యేర్పడవలెను, అనుటయే యీ యుద్యమముయొక్క సారాంశము. పరాసుభూమిలో పరోక్షనిర్వచనమే ఉత్తమాధికారి నియమనమున కాధారమై యున్నది. శాసనసభలు రెండును ప్రజలచే నిర్వచితములు. ఈరెండు సభలును చేరి అధ్యక్షుని నియమించుచున్నవి. ఈపద్ధతి ఫలప్రదమని వాదించునట్టివారు రెండు కారణములను నిరూపించుటగలదు. అధ్యక్షకపదవియం దుండువారు చేయవలసినకార్యముల కొక ప్రతిభ కావలయుననుట నిక్కువము. అట్టిప్రతిభ యెవ్వరికి పూర్తిగా గలదని నిశ్చయించుటకు ప్రజాసమూహమునకు తగిన శక్తి చాలదు శాసనసభల ప్రతినిధులకు అనుభవముపైని ఆశక్తి కలిగి యుండగలదు. ఇది మొదటికారణము. ఇక రెండవ కారణమో, కార్యనిర్వహణమునందు ఒద్దికతో పనిచేయవలసియుండువారలు రాష్ట్రాధ్యక్షుడు, రాష్ట్ర శాసనసభ. రాష్ట్రశాసనసభవారు అధ్యక్షుని నెన్నుకొందురేని వారికిని, ఈతనికిని చక్కని పొందు పొసగగలదు. అవును కాని, శాసననిర్మాతలే శాసననిర్వాహకుని నేర్పరచుట సంభవించుచున్నదే. ఇది నష్టదాయకముకాదా అనువారు కొందరున్నారు. అంతియేగాక అధ్యక్షునియెన్నికలు రభసముతో జరుగవలసియున్నప్పుడు శాసనసభలోనిసభ్యులు అందులో నిమగ్నులయినయెడ అవసరమగు శాసననిర్మాణముగతి యేమగును అని మరికొంద రడుగుచున్నారు. అధ్యక్షుడు కాదలచుకొనినవాడు తన యధ్యక్ష కాధికార కాలమునందు శాసనసభసభ్యులలో పలుకుబడికలవార