ఈ పుట అచ్చుదిద్దబడ్డది

56

ప్రభుత్వము

డిన దగిన యధికారుల పరంపరను నియమించునట్టి ముఖ్యాధికారము పూర్తిగ నతనిదైనను నగును. లేదా అతడును, అతని పరిసరవర్తులును నిర్వహించునట్టిది యైనను నగును. ఈయధికారము నుపయోగించుటయందు నక్రమములు అనేకదేశములలో పొడగట్టినవి. ఆకారణముచేత “సివిలుసర్వీసు” లనుపేరిట నెన్నటికిని మారనియట్టి అధికారవర్గము లేర్పడియున్నవి. పరీక్ష లేర్పరచి తన్మూలముగా నుత్తీర్ణులగువారలను నేరి నియమించుటచేత ఉత్తమాధికారి ఇష్టానిష్టములతో నక్కరలేని యధికారవర్గ మేర్పడునను నమ్మకము ఈసివిలుసర్వీసుల యుత్పత్తికి మూలాధారము. స్వపరిపాలితరాష్ట్రములలో నొక కక్షివారిప్రాబల్యము పోయి మరియొక కక్షివారి ప్రాబల్యము సమకూరినప్పుడు కార్యనిర్వాహకు లెల్లరును మారుచుందురేని కార్యనిర్వహణ మనునదియే సున్నయగును. ఇంగ్లండు చరిత్రమునందు కొలదిమాసములకంటె నెక్కువగా అధికారమందుండని యట్టి ప్రజాప్రతినిధిసభ లెన్నియో కానవచ్చుచున్నవి. యుద్ధకాలమునందు ఇటలీ, గ్రీసు ఈరాష్ట్రములును, ఫ్రాంసును పడిన పాట్లుచూచిన యెడల నీవిషయము ఇంకను స్పష్టముగా నర్థముకాగలదు. నేటి జర్మనీచరిత్రమును దీనికి నిదర్శనము, 1919-వ సంవత్సరము మొదలు 1928-వ సంవత్సరలోపల 15 మంత్రివర్గములు మారిపోయినవి. అనగా నొక్కొక మంత్రి వర్గమునకును 8 నెలల సరాసరి జీవితమని యర్థము. నేడొక మంత్రివర్గము, రేపొక మంత్రివర్గము, మూడవనాడు మరియొక మంత్రివర్గము. ఈమంత్రివర్గము లొక్కొ