ఈ పుట అచ్చుదిద్దబడ్డది

48

ప్రభుత్వము

రా. ఆఎన్నుకొనినవారే ప్రతినిధిస్థానమునం దుందు రేని వారును సమయానుకూలముగా ఆలోచన చేయవలసి యుందురు. ఏదైనను ప్రశ్న పొడసూపినప్పుడు దానికి సంబంధించిన పూర్వాపరముల నాలోచించి తీర్మానముచేయ వలసియుందురేకాని నాడిట్లంటిమి నేడును నిట్లేయందుమనుటకు రాదు. తమప్రాంతపుమేలును దేశపుమేలును వితర్కించి దేశపుమేలునకు తమప్రాంతపు మేలును లోబరచవలసిన వారైనను కావచ్చును. అందుచేత ప్రతినిధులకు స్వాతంత్ర్య ముండవలయుట అత్యవసరమై దోచుచున్నది.

అయిన ప్రతినిధులు తమస్వాతంత్ర్యము పేరుబెట్టుకొని తమ్మును నియమించినవారి యభిప్రాయములను లక్ష్య పెట్టక ప్రవర్తించుటకలదు. ఆకారణముచేత కొన్ని కొన్ని రాష్ట్రములలో శిక్షిత ప్రాతినిధ్యము ప్రారంభమయినది. ప్రతినిధి తన్నెన్నుకొనినప్రాంతమువా రేమిచెప్పిన నది చెప్పవలసిన దేకాని స్వతంత్రాభిప్రాయ మీయరాదు. ఈచిలుకపలుకు ప్రాతినిధ్య మంత బాగుగా నుండలేదు. ప్రతినిధియైనవాడు తన నిర్వాచకవర్గము నప్పుడప్పుడు కలిసికొనుచు తన యభిప్రాయములను వారికి చెప్పుచు వారి యభిప్రాయములను తానువినుచు సాధ్యమయినంత మట్టుకు వారి యభిప్రాయము ననుసరించుచు ప్రవర్తించు నెడల ఈ చిలుకపలుకు ప్రాతినిధ్యముకాని, అనిరంకుశ ప్రాతినిధ్యముకాని బాధింపకుండును. చక్కగా కక్షలేర్పడి దినదినమును ఆనాటి సమస్యలపై దృఢాభిప్రాయమిచ్చుచుండు దేశములలో ప్రతినిధి కెంతో కష్టముండదు.