ఈ పుట అచ్చుదిద్దబడ్డది

శాసననిర్మాణస్వరూపము

33

వారందరును తాలూకాబోర్డులకు, జిల్లాబోర్డులకు సభ్యులను పేర్కొనుచుండినారు. పట్టణపాలక సంఘసభ్యులును ఈవిధమగు కొన్నిఏర్పాటుల ననుసరించి ఏరుకొనబడు చుండినారు. ఇట్లేర్పడిన జిల్లాబోర్డు తాలూకాబోర్డు సభ్యులును, పట్టణపాలకసభ్యులును శాసననిర్మాణసభకు చెందతగిన సభ్యులను ఎన్నుకొనుచుండినారు. ఇండియా శాసనసభకు సభ్యుల నెన్నుకొను నధికారము జిల్లాబోర్డు తాలూకాబోర్డు సభ్యులకును, పట్టణపాలకసభ్యులకును నుండినది కాదు. మన శాసనసభలలోని సభ్యులు తమలో నుండియే తాము నియమించుకొను చుండినారు. ఈకారణములచేత మన శాసననిర్మాణసభలలో పరోక్షపద్ధతి ద్విగుణీకృతమై చెన్నారుచుండినది. లోకములో మరియెచ్చటను ఇట్టి ద్విగుణీకృతపరోక్షపద్ధతిగాని, సామాన్య పరోక్షపద్ధతికాని ప్రజాప్రతినిధిసభలకు సంబంధించి నంత వరకు లేదు. ఒక్క శిష్టసభకుమాత్రము కొన్ని కొన్ని ప్రాంతములలో ఈ పద్ధతి వ్యాప్తియందున్నది.

పరోక్షనిర్వచనమున కర్థమేమి యనునది యిచ్చట గ్రహింపదగియున్నది. ప్రజాసమూహమునెడల గల యొక యపనమ్మిక ఈపద్ధతికి కారణ మనుట స్పష్టము. పరోక్షముగా ప్రతినిధు లేర్పడునెడల ప్రజలలో తాత్కాలికముగాగల యుద్రేకములు ఆప్రతినిథినిర్వచనమున ప్రతిబింబింపవనియు అందుచేత కార్యనిర్వహణమున కేర్పడిన ప్రతినిధులు శాంతపరులై , ఆలోచనాయుతులై యుందురనియు విశ్వసించుటయే యీ పద్ధతికి మూలాధారమగు కారణము. నిర్వచనాధికారము కొందరకు మాత్రమే