ఈ పుట అచ్చుదిద్దబడ్డది

32

ప్రభుత్వము

యము, నార్వే, స్వీడను, హాలండు, జర్మనీ, ఆస్ట్రియా, ఇటలీ, పోర్చుగలు, స్పెయిను, హంగరీ, పోలండు, అల్బేనియా, రుమేనియా, గ్రీసు, అయిర్లాందు, ఆస్ట్రేలియా, ఆర్జెంటైనా, బొలీవియా, బ్రెజీలు, చిలీ, చీనా, క్యూబా, జెక్కో స్లో వేకియా, హెయిటీ, పోలండు, సంయుక్త రాష్ట్రములు ఈరాజ్యములన్నిటను శిష్టసభ సభ్యులు ప్రజానిర్వచితులుగా నుందురు. ఆఫ్రికాలో 'లైబీరియా' యను నీగ్రోల ప్రజాసత్తాకరాష్ట్ర మొకటిక లదు. అచ్చటను శిష్టసభకలదు. - అందలిసభ్యులును ప్రజానిర్వచితులు, జర్మనీ, ఇటలీలలో నియంత లేర్పడుటచేతను, హిట్లరు ఆస్ట్రియాను స్వాధీనము చేసికొనుటచేతను ఈదేశముల రాజ్యాంగ స్వరూపము స్థిరము కాలేదు.

పరోక్ష నిర్వచనము

శిష్టసభయందుగల సభ్యులను 'ఎన్నుకొను' పద్ధతిని అవలంబించు దేశములలో ప్రజాప్రతినిధి సభయొక్క ప్రతిబింబము ఈసభ కాకుండుటకు నిర్వచనపద్ధతులలో అనేక తారతమ్యము లేర్పడియున్నవని ఇదివరలో నే నూచితమయినది, అందులో ప్రధమగణ్యము పరోక్షనిర్వచనము. సమ్మతిని ఇచ్చుటకు అధికారముగల ఒక్కొక్క పురుషుడును, ఒకొక్క స్త్రీయును ఈతడు మా ప్రతినిధిగా నుండదగినవాడని నేరుగా నియమించుకొనుపద్ధతి ప్రత్యక్ష పద్ధతియనుట ప్రత్యేకించి వ్రాయనక్కర లేదు. దీనికి దూరమైనది పరోక్షపద్ధతి. మనదేశములో శాసనసభల యెన్నికలకు ఈపద్ధతియే 1920–వ సంవత్సరమునకుముందు ప్రచారము నందుండినది. అప్పుడు రు 30 ల శిస్తునిచ్చు