ఈ పుట అచ్చుదిద్దబడ్డది

శాసననిర్మాణస్వరూపము

29

ప్రతినిధిసభవారిచే నామోదితమైన కార్యము నొకకొంత జాగుసేయు నధికారము మాత్రము కలవారై యున్నారు. మిగిలిన శాసనాధికారస్వాతంత్ర్యము లేవియును వారికి దక్కియుండ లేదు. ప్రభుసభ యింతటి మహావిమర్శకు భాజనమైయుండియును ఆంగ్లభూమిలో దానికి నిలకడ కలుగుటజూడ జిత్రముగా దోచకపోదు. ప్రభుసభలోని సభ్యుల కొక్కొక్కరికిని నగరములలో, గ్రామసీమలలో ఆస్తిపాస్తు లున్నవి. వ్యాపారములలో, వ్యవహారములలో ఎక్కువ జోక్యమున్నది. సామాన్యముగా వీరలు ప్రజూకక్షలలోజేరు నభ్యాసము కలవారుకారు. . కాబట్టి ప్రజలలో తీక్ష్ణసమస్యలయం దావేశముకనుపట్టి వ్యవహార ముద్రేకముగా జరుగునట్టి సమయముల వీరలు నిశ్చలులై నిష్పాక్షికదృష్టితో సలహాలిచ్చి ప్రజావేశమును శాంతమార్గములకు దేగలరను నభిప్రాయమే వీరియునికికి కారణమని పలువు రాడుకొనుచున్నారు. ఇంగ్లండులోని ప్రభుసభకు మరియొక గొప్పగౌరవ మమరియున్నది. ప్రీవి కౌన్సిలు అనబడు సంఘ మీసభలోని యొకభాగము. బ్రిటిషుసామ్రాజ్యములోని అన్ని యుత్తమన్యాయస్థాన ములందుండియు అప్పీళ్లీ ప్రీవీకౌన్సిలుకు పోవలెను. అధినివేశములలోని ప్రసిద్ధన్యాయమూర్తుల కిందు స్థానము కల్పించుచున్నారు,

మరి యేమహారాజ్యమునందును ఆంగ్లరాజ్యములోవలె పరంపరాగతపద్ధతి శిష్టసభనిర్మాణమునకు వినియోగింప బడుచుండుటలేదు. ప్రపంచమహాసంగ్రామమునకు ముందు ఆస్ట్రియా, స్పెయిను, ఇటలీ, హాలండు