ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ప్రభుత్వమనగా నేమి?

9

యములలో కొంత పనిచేసినది. స్వల్ప రాష్ట్రములపైకి గొప్పరాష్ట్రములు లంఘించి బలహీనులను నశింపజేయకుండ కాపాడవలెనను ప్రయత్నమున ఇటలీ, జపాను, జర్మనీల సామ్రాజ్యకాంక్షల నెదుర్కొనలేక భగ్నమయినది. సమితిలో ప్రధానరాష్ట్రములగు ఇంగ్లండు, ఫ్రాంసులు సామ్రాజ్యతత్త్వమునకు పుట్టినిండ్లగుటచేత సర్వరాష్ట్రసమితి ఫలవంతము కాలేకపోయినదని తజ్ఞుల యభిప్రాయము. అందుచేత ఏరాష్ట్రమున కారాష్ట్రము ప్రజాసౌకర్యసంబంధములగు సర్వధర్మములను నిర్వహించుచు ప్రాతనాటి దేశసంరక్షణకార్యక్రమమునుగూడ నాటికంటె నేడొక్కువగా తీర్చుకొనవలసినవి యయినవి. ముందు పరిణామ మెట్లుండునో చూడదగును.

పైన ఇదివరకు వివరించిన ఇంటిపెద్దయొక్కయు గ్రామముపెద్దలయొక్కయు కార్యక్రమముతో ప్రభుత్వము అనునట్టి అధికారముయొక్క కార్యక్రమమును పోల్చి చూచినయెడల రెండును వ్యాప్తిభేదమాత్రముతో ఒక్కటియేయనుట యెట్టివారికిని అర్థము కాకపోదు. కాబట్టి ప్రభుత్వము అను అధికారనిర్వహణము సామాన్యమగు విషయమేకాని ఏదో దుస్సాధ్యమగు పనికాదని వ్రాసితిమి. అట్టి సామాన్యవిషయము అయినందువలననే లోకములో నాగరకములేని అనేక రాష్ట్రములుకూడ స్వయంపరిపాలితములై యున్నవి.

ప్రభుత్వమను నధికారము సామాన్యవిషయమే యైనను బహుకాలముగా లోకములోని భిన్నజాతులు దీనిని నెరవేర్చుకొనుచు వచ్చియుండుటచేత, భిన్న భిన్న