ఈ పుట అచ్చుదిద్దబడ్డది

110

ప్రభుత్వము

నెడ లోకులకు మదింపు చెడునను సిద్ధాంతమె ఈకోర్టుల యునికికి మూలాధారము. ఈసిద్ధాంతము తప్పనుట స్వయంప్రకాశము. అయినను ప్రత్యేకము కోర్టులు నేటికి రేపటికి నున్నవనుట నిజము. కోర్టులజాతులు ఇతరవిధములైనవిగలవు. మతవిషయకమైన కోర్టులు సాధారణముగా పాశ్చాత్య దేశము లన్నిటను గలవు. సైనికవిషయక దోషములను పరీక్షించు కోర్టులు సైనికాధికారులతో జేరినవి యెల్లయెడలను నున్నవి. వ్యాపారవాణిజ్యములు వ్యాపించి ప్రత్యేకమగు సాంకేతికవ్యవహారములు పెరిగినప్పుడు వాని తీర్పునకు ప్రత్యేకన్యాయస్థానములు కొన్ని దేశములయం దేర్పడియున్నవి. శిక్షకు సంబంధించిన సిద్ధాంతములు మారుకొలదిని నేటిదినము పిల్ల లకు ప్రత్యేకన్యాయస్థానము లేర్పడవలసి వచ్చినవి.

విపరీతములు వీడ్వడుట

న్యాయవిచారణకు మిక్కిలి సున్నితమైన సాధనము లేర్పడినవి. నిజమరయగా, ప్రాచీనకాలముల యందు అనేక దేశములలో ప్రజలలో అంతస్థులేర్పడి ఒకేనేరమునకు నొక్కొక యంతస్థునందలి మనుష్యునకు నొక్కొక్క రీతి దండన నియమితమై యుండినది. పాశ్చాత్యభూములలో బానిసలు ఎక్కువగా నుండువారు. యజమాని వారి నేమి చేసినను చేయవచ్చును. అతనికి శిక్షయేలేదు. భార్యలను భర్తలెంత హింసించినను దిక్కు లేదు. బిడ్డలు తండ్రులసంగతియు నదేగతి. మధ్యమయుగమున నైరోపాలో మతాచార్యులు తప్పుచేసిన నొక్కదండన, సామాన్యుడు అదేతప్పు చేసిన వానికి వేరుదండన. ప్రభువు తప్పు