ఈ పుట అచ్చుదిద్దబడ్డది

శాసనవివరణస్వరూపము

103

అట్టి కార్యమున కర్హతగలవారిని నేర్పరచుభారము సహస్రశీర్షంబగు ప్రజ ధరింపగలదా ?

న్యాయవిచారకర్తలను నియమించు నధికారమును మరి నాగరికలోక మెవ్వరికి ప్రసాదించినది? ఉత్తమాధికారికి, అనగా నధికారివర్గమునకు. ఇక న్యాయవిచారణ కర్తల స్వాతంత్ర్యము గతియేమియని సందియము పడవలదు. ఉత్తమాధికారికి సామాన్యముగా నియమించు నధికారము మాత్రమున్నది. తీసివేయునధికారము లేదు. జీతము తగ్గించు నధికారములేదు. సాధారణముగా మార్చునట్టి యధికారముకూడ లేదు. న్యాయవిచారణాధికారిని నియమించిన తరువాత దుర్మార్గప్రవర్తకుడు కానంతకాలము న్యాయవిచారాణాధికారిని, తాకుటకైనను ఉత్తమాధికారికి స్వాతంత్ర్యమ లేదు. ఇదియే నాగరక రాష్ట్రములు అవలంబించిన రెండవయుపాయము. తన పదవినుండి తన్ను తొలగించు నధికార మెవ్వరకునులేదని తెలిసినప్పుడు మానవుడు చూపగల స్వాతంత్ర్యము మిక్కిలి యెక్కువ. ఈ యుపాయమేకాక మరియొక యుపాయమును నాగరకలోక మవలంబించినది. తగిన యాదాయములేనినాడు మానవుడు పదిరూపాయల లాభముదొరుకు ననినయెడల భ్రమప్రమాదముల పాలగుట సంభవింపవచ్చును. న్యాయవిచారణకర్త లిట్టి భ్రమ ప్రమాదములకు లోనగుదురేని న్యాయవిచారణ యంతయు నెదురుదిరుగును. కాబట్టి లోకములోని నాగరకరాష్ట్రము లంతటను న్యాయవిచారణకర్తలకు మిక్కిలి యెక్కున జీతములు నిర్ణీతములయి యున్నవి. ఏమాత్రము