ఈ పుట అచ్చుదిద్దబడ్డది

100

ప్రభుత్వము

చేతను తదనుగుణశాసననిర్మాణముచేతను తీర్చుకొనుచున్నారు. ప్రజూపరిపాలన పూర్ణముగాలేని దేశములయందును అంకితములైన దేశములలోను ఆయాదేశములకు తగినరీతిని ఆందోళనము సలిపి ప్రభుత్వమును ప్రజ తమదారికి దెచ్చుకొనుటకు జూచుచు సాధ్యమైనంతమట్టుకు తీర్చుకొను చుందురు.

అధికారికి అధికారికి కలుగునట్టివిభేదములు రెండు తెరంగులు. సమానాధికారములుకలవారికి కలుగు విభేదములు ఒక తెగ. ఎక్కువయధికారికి తక్కువ యధికారికి కలుగు విభేదములు ఇంకొక తెగ. ఈరెండవ తెగకు సంబంధించిన విభేదములను మనము గమనింపనక్కరలేదు. దేశములోని యుత్తమాధికారి వరకుంగల పరంపరలో నెవ్వరేని యొక్క రీవిభేదములను సమపరచుచున్నారు. సమానాధికారము కల యధికారులవిషయముమాత్ర మాలోచింపదగినది. ప్రత్యేకము ప్రత్యేకము స్వాతంత్ర్యములు కలిగియు అమెరికాసంయుక్తరాష్ట్రములలోవలె రాష్ట్రము లనేకము లొక్క సంయుక్త రాష్ట్రముగా చేరినప్పుడు సమానాధికారుల విభేదముల మాట యాలోచనకు వచ్చును. అట్టి విభేదములు ఆరాష్ట్రముల ప్రతినిధులచే నేర్పడు శిష్టసభలో తీర్మానమగుచున్నవి.

తక్కుంగల మూడువిధములగు విభేదములను తీర్చునట్టి యధికారము నేటిదినము ఎక్కువగా ప్రభుత్వమునకే సంక్రమించి యున్నది. సంక్రమించుచున్నది. పూర్వకాలమునందు- నేటి నవీననాగరకము లోకమును తన స్వాధీనము చేసికొనుటకు ముందు - మానవునకును మా