ఈ పుట అచ్చుదిద్దబడ్డది

22 ప్రబంధరత్నావళి

చ. గురుకుచకుంభము ల్గదలఁ గ్రుమ్ముడి వీడఁగ రాలఁ గ్రొవ్విరుల్
కరమణికంకణక్వణనకాచనగధ్వను[?] లుల్లసిల్లఁగా
భరతపుఁబిట్టకైవడిని బాదికిఁ జేరెడి వెల్చెలాగునన్[?]
బరిపరిరీతులన్ జెలఁగు భంగులు మెత్తుఁగదే కళావతీ! (ఆం) 94

చ. ప్రకటితలీలఁ గీ లెడలి పాపటముత్తెపుఁజేరు మోముపైఁ
దకపికలాడఁ గ్రక్కదలు దంతపుఁ గమ్మలకాంతి మొత్తమై
వికచకపోలభాగముల వెన్నెల గాయుచునుండ నీవు నన్
................................... లాగులు మెత్తుఁగదే కళావతీ! (ఇ) 95

కేతన, మూలఘటిక [ఆంధ్రభాషాభూషణము] (జ)

ఉ. మెచ్చుఁడు మెచ్చవచ్చునెడ, మెచ్చకుఁ డిచ్చకు మెచ్చు రానిచో,
మెచ్చియు మెచ్చు మ్రింగకుఁడు, మెచ్చక మెచ్చితి మంచుఁ గ్రుచ్చలై
మెచ్చకుఁ, డిచ్చ మెచ్చుఁ గని మెచ్చుఁడు, మె చ్చొకమానమైనచో
మెచ్చియు మెచ్చకుండకయు మెచ్చుఁడు, సత్కవులార! మ్రొక్కెదన్.[1] (జ) 96

కేతనప్రెగడ, భాస్కరుని [కాదంబరి] (ఇ)

శా. గంధర్వాత్మజ రాజుఁ జూచెఁ బతియుం గాదంబరిం జూచె ద
ర్పాంధీభూతమనస్కుఁడై మరుఁడు విల్లందెన్ బ్రసూనోల్లస
ద్గంధం బొప్పఁగ నెక్కువెట్టి గుణనాదం బాని పుష్పాస్త్రముల్
సంధించెన్ దెగఁబాపి యేయఁ దొడఁగెన్ సవ్యాపసవ్యంబుగన్. (జ) 97

సీ. దీనిలోపలఁ గొన్నిదినము లుండిన నుష్ణ కరుఁడైన నట శీతకరుఁడు గాఁడె?
దీని లోఁ తెరిగినఁ దా నంబురాశిలోఁ గా దని జలశాయి గాఁపురాఁడె?
దీనితీయనినీరు దివిజులు త్రావిచూ చినఁ దమయమృతంబు చేఁదు నారె?
దీని తోయమ్ముల దీర్థమాడిన నెంత పాపాత్ములును మోక్షపదవిఁ గనరె?
ఆ. యనుచుఁ గొలనినీటి యతిశీతలత్వంబుఁ
బఱపు పెంపుఁ దీపుఁ బావనతయు
మనుజనాయకుండు గొనియాడి పడివాగె
త్రాట హయముఁ దిగిచి తఱియఁజొచ్చె. (ఇ) 98

  1. ఈపద్యము ముద్రిత మగునాంధ్రభాషాభూషణమునఁ గానరాదు. తాళపత్రప్రతులందును గానరాలేదు.