ఈ పుట అచ్చుదిద్దబడ్డది

61


ఆంధ్ర వాజ్మయచరిత్రకారుల కత్యంతోపయుక్తమైన యీ గ్రంథమును పునర్ముద్రణము చేసినందులకు డాక్టరు వేటూరి ఆనందమూర్తిగారిని యత్యంతము నభినందించుచున్నాను.


ప్రభాకరశాస్త్రిగారి గ్రంథముల నన్నింటిని పునర్ముద్రించుటకు వారు చేసిన ప్రణాళిక పూర్తియై ఆంధ్ర సాహిత్యవీథి నలంకరించుగాత,


మానపల్లి కవిగారి సంకలన గ్రంథములు ప్రబంధమణిభూషణము, సకలనీతి సమ్మతముతోపాటు నీ ప్రబంధరత్నావళికి పీఠిక వ్రాయు నవకాశము నా కొసగిన డాక్టరు ఆనందమూర్తిగారికి ఈ పీఠికారచనమున నాకు చేదోడు వాదోడుగా నున్న నా పెద్ద కుమారుడు చీ|| శివసుందరేశ్వరరావునకు యాశీస్సులు.


ఇతి శివమ్


18-5-78

2-2-1187/5

లక్ష్మీకాంత నిలయము

నిడుదవోలు వేంకటరావు

హైదరా బాదు - 44.