ఈ పుట అచ్చుదిద్దబడ్డది

49


ముద్రితపాఠము

1. క్రమణ
2. 'ప్రత్యూష' అయియుండును
3. కట-
4. 557. సీ. తిమిర భూతముకుదెలియ
..... ...... ........ .........
చంద్రుఁడుదయించెఁ గాంతి నిస్తంద్రుఁడగుచు 8-84
5. 577. ఉ. రాజిత తేజుఁడైన దీనరాజు. 8-81.
ఈ పద్యములను గ్రంథములో జేర్చుకొనుడు.

6. గీ. పొదలియొండొంట దివియును భువియుదెసలు
బొదివి కొనియెడిచీకటి ప్రోవువలన
మిక్కుటంబుగఁగాటుక గ్రుక్కినట్టి
కరవటంబనజగదండఖండమమరు ......................3-80. .

చెన్నమల్లు శ్రీ గిరన్న

ఈతని శ్రీరంగమహాత్మ్యమునుండి నాలుగు పద్యము లుదాహృతము లైనవి.

ఈ శ్రీ గిరన్నకవి-ప్రోలయవేముని మోగల్లు శాసనము (క్రీ. శ. 1815)న పేర్కొనబడిన "ప్రమథకవి శ్రీగిరి" అని వాజ్మయచరిత్రకారుల యభిప్రా యము. ఈతడు శ్రీరంగనూహాత్మ్యమే గాక “నవనాథచరిత్ర" అను పద్య కావ్యమును రచించినట్లును, దానిని తాను ద్విపదగా చేసినట్లును గౌరన తన నవ సౌథ చరిత్రలో తెలిపినాడు-మడికి సింగన సకలనీతి సమ్మతమున నుదాహరించిన శ్రీగిరీశ శతకము (చిరతరప్రకాశ - శ్రీగిరీశ - అనుమకుటము) శ్రీగిరిదే నని కొందరి యభిప్రాయము.

ఈతడు , శైవుడగుట స్పష్టము. ఆయితే శైవుడు వైష్ణవ క్షేత్రమై, వైష్ణవమత సంబంధమైన శ్రీరంగమాహాత్మ్యము వ్రాయునా అని మనకు సందే హము కలుగవచ్చును కాని అట్టి సందేహమున కవకాశము లేదు- శైవుడనని స్పష్టముగా చెప్పుకొన్న పోతన, వైష్ణవ గ్రంథమగు భాగవతమును రచించెను.