ఈ పుట అచ్చుదిద్దబడ్డది

32


దాహృతములు పెక్కులు మనకు దొరకవలసియున్నవి.పేరుకూడ లేకుండం గాలప్రవాహమింక నెన్ని మంచికావ్యములను ముంచి వై చినదో గదా ! ఈ సంధాతలు ప్రాచీనులే యగుటచే వారి కాయా కవీశ్వరుల కావ్య ములు దొరికి పోయుండుననియు వారు దానిని బథించియే పద్యములను సంగ్రహించిరనియు విశ్వసింపఁగూడును అయినను బ్రతివిలేఖకా దులమూలమున నిప్పుడు దొరకిన ప్రతులందుఁ గొన్ని కావ్యముల పేళ్ళును గవుల పేళ్ళును దార్మా రయియుండవచ్చును. కొన్ని పద్యముల విషయమున నీ రెండుసంధానములకును దైవిధ్య మేర్పడెను. ఈపద్య మీకావ్యమందలి దగును గాదని నిర్ధారింప కావ్యములు దొరకినంగాని కుదురచుగదా: ఈసంధానములకుఁ బ్రత్యంతరము లేని లభింపవయ్యె.


ఈ గ్రంథము చెన్నపురిలో ముద్రింపఁబడుచుండుటయు నే నక్కడ నుండరాకయవిరత ప్రయాణములతో దేశాటనము సల్పవలసియుండుటయు సంఘటిల్లుటచే నచ్చుపని చూడ నేకాక పీఠిక వ్రాయను వలసిన గ్రంథపరికరము పరికింపను గూడఁ గుదురదయ్యెను. అయినను నా రెండు ప్రాచీనసంధాన ములను జతకూర్చుట మొదలుగా సిట్లు ముద్రితమై వెల్వడుదాఁకఁ జెన్నపురిలో మన్మిత్రులు బ్రహ్మశ్రీ గన్నవరపు సుబ్బరామయ్య గారు సల్పిన తోడ్పాటు, పరిశ్రమము, మిక్కిలి పెక్కువ. వారితోడ్పాటు లేనిచో నే నిప్పుడిగ్రంథమిట్లు ముద్రింపఁజాలను. మాముద్రణావసరమునఁగూడఁ గొన్నిపొర పాట్లు పొసఁగియుండవచ్చును. సందిగ్ధము లగు పద్యభాగము లట్లే నిల్పితిమి ప్రయత్నపూర్వక మగు విపర్యయ మిందేదియు నుండదు. ప్రమాద ములు సరిపఱుచుకొసఁ బ్రాజ్ఞులకు నమస్కారము.

వేటూరి ప్రభాకరశాస్త్రి, 9-1-18.