ఈ పుట అచ్చుదిద్దబడ్డది

31


ఈతడు హరిభట్టు:-----బహుగ్రంథకర్త గా నున్నాఁడు. ఈతని మాత్స్యవారాహపురాణములు దొరికియున్నవి. ఉత్తర నృసింహపురాణము దొరక లేదు. విష్ణుభాగవతము నే కాదశ ద్వాదశ స్కంధములుగూడ నీతఁడు తెలిఁగించినాఁడు. ఆంధ్ర సాహిత్యపరిషత్పుస్తక భాండాగారమున 'హరి' భట్టు రచించినట్టు పై రెండు స్కంధములు నున్నవి. హరిభట్టనుటకు హరికభట్ట సుట వ్రాఁత గాని దోషమే.

సితిసారము, పంచతంత్రి, కామందకము, మొదలగు కొన్ని గ్రంథము లకు గర్త లేవనో యెఱుఁగ రాదు, మఱికొన్ని పద్యము లేగ్రంథము లందలివో కూడ నెఱుఁగరాక యున్నవి. ఇందుఁ బేర్కొనఁబడిన కవీశ్వరులు పెక్కురు పాయికముగా కం. వీ. కవులచరిత్రము ప్రథమభాగమునఁ జేరఁదగినవా రగు దురు. ఇంతవఱకు నాంధ్రభాష లోఁ గవిజనాశ్రయముతక్క జైన ప్రసక్త మగు కబ్బము కానరాలేదు. ద్రవిడకర్ణాటభాషలలో జైనకృతులు పెక్కులున్నవి. ఇందు జినేంద్రపురాణ మనియు నాదిపురాణమనియు రెండు జైనప్రబంధము బుదాహరింపఁబడినవి. కాని వానియందలిపద్యము లెక్కువగాఁ జేకొనఁబడ వయ్యేను. ఉన్న పద్యములంజూడగాఁ బ్రాచీనతర రచనముగాఁ దో పకున్నది


సంస్కృత వాజ్మయమున జార్జ ధరుని పద్ధతి, జల్హణుని సూక్తి ముక్తా వళి, వల్లభదేవుని సుభాషితావళి మొదలగు సంధాన గ్రంథముల మూలమున నిప్పుడను పలభ్యమాసము లగు కావ్యములయుఁ గవులయు వృత్తాంతము లెన్నోగుర్తింపఁబడు చున్నవి; అట్లే యీ సంధానములు గూడ నెందఱునో యపూర్వకవుల , నెన్నింటినో యపూర్వకావ్యములను బయల్పరచినవి. ఇందుఁ గొన్నియేని మన భావిపరిశీలన మూలన బయల్పడఁగల వని విశ్వసింతము, మటియు నెట్టా పెగ్గడరామాయణము మొదలగు ప్రాచీన ప్రబంధము లిందుఁగూడ నను


యము ప్రాచ్యలిఖిత పుస్తకాలలో సున్నది. అందెక్కడను సరసింగరాయలకుఁ జంద్రశేఖరుఁ డసు నియోగిపుంగవుడుఁ మంత్రిగా నున్నట్లు కానరాదు. మఱెక్కడి ప్రతిలో నట్టు చూచినారో ! ఆచరణమున కట్టి యర్ధములేదు. శృంగార శ్రీనాథమందలి " కనకాభిషేకము చూ, \ 1. తంజావూరు పుస్తకళాలలో వేంకటరాజప్రణీత మగుకామందకము పద్యకావ్య మున్నది. అది యిది కానట్టున్నది.