ఈ పుట అచ్చుదిద్దబడ్డది

24


.

లేములవాడ భీమ | భళిరే ! కవిశేఖర సార్వభౌమ ! నీ
వేమని యానతిచ్చితివి యిమ్ములఁ గోమటి పక్షపాతివై
కోమటి కొక్కటిచ్చి పదిగొన్నను దోసము లేద యంటివా
కోమటి కొక్కటీక 'పది గొన్న' ను ధర్మమె ధర్మపద్ధతిన్ "[1]

కోమటి సొమ్ముఁదిని కృతినమ్ముకొని యాతని నెంతో పెద్దగా ప్రకటిం చిన కవినోరే యాకోమటి కాలము వారినిట్టు తిట్టునా : ఏమో ! కృతి చెప్పించు కొని వెల్లడించుకొని తుదకుఁ గోమటి ద్రోహముచేయఁగాఁ దిట్టినాఁడేమో ఏమో ఊహలెందులకు? “ఘనుఁడన్ వేము వాఁడవంశజు డ" నిత్యాది చాటు పద్యములకుఁ బ్రసక్తుఁ డగు భీమకవి కవిజనా శ్రయకర్త కానేరఁ డనియే నాతలంపు అతఁడు శివభ క్తిపరాయణుఁడు. ఐతిహ్యములు, చాటుపద్యములు, నితరక వికృత స్తుతులు, నీవిషయమును రాద్ధాంతపఱుచుచున్నవి. పార్వతీపర మేశ్వరులే తమకుఁ దల్లితండ్రులనుట శైవుల సంప్రదాయము. "ధర నుమా మాతా పితా రుద్ర యనెడు | వరపురాణోక్తి నీశ్వరకులజుండ బసవని పుత్త్రుండ బసవగోత్రుండ" 2[2] పాల్కురికి సోమనాథుఁడు.

"ఇట్లే భీమకవియుఁ దాక్షారామ భీమేశ నందనుఁడ "నని చెప్పి కొన్నాడు ఇఁకఁ గవిజనాశ్రయకర్తగా గ్రంథమున నెఱుఁగఁబడు రేచనజైసుఁడు శైవులకును జైనులకును బ్రచండ విద్వేషము. ఏరికి వారికి నా నాటుతాళ్ల పెట్టు. మతమున విశ్వాసము, పట్టుదల, నెట్టుకొని యున్నయా కాలమున మాఱుమతము వాని పేరఁగృతిని వెల్లడించుటయేకాక యందుఁ, దనకు మిక్కిలి విద్వేషింపదగిన యామాఱుమతపు దేవరనుబ్రశంసించుటయు 'భీమేశ నందనుఁడ 'నని చెప్పుకో:- స్వమతాభిమానికి భీమకవి వంటివానికి సంభవింపదు కవిజనాశ్రయమున

దేవతా ప్రశంసయే కాక స్తోత్రముకూడ నున్నది. శ్రీ జయంతిరామయ్య

  1. ఈ పద్యమున లేములవాడ యనియె కలదు. తక్కిన భీమకవి చాటువుల్నుటిలోకి
    గూడ లేములవాడ, యను పారమున్నది, పయోగరత్నాకరమున నుదాహ
    రింపఁబడినది.
  2. కం. వీ. కపులచరిత్రమున, “దీనినిబట్టి సోమనాథుఁడు లింగాస్యని, పౌత్రుఁ డయినట్టును బసవేటని పుత్రుఁ డయినట్టును గనంబడుచున్నాఁడు" అని యుండుట సరికాదు.