ఈ పుట అచ్చుదిద్దబడ్డది

23


"ఉ. చండాంశు ప్రభవీక్ష తిమ్మయతనూ కా ! తిమ్మ విధ్వసపా షండంబైన త్రిలింగ భాగవత షష్ఠస్కండభాగంబు నీ కండక్కెం జతురాననత్వగుణయుక్తు ల్మీలు వాణీమనో భండారోద్ధతి చూఱకార బిరుద ప్రఖ్యాతి సార్థంబుగన్.”

ఈ సంధానమున మలయమారుతము సర్వయ షష్ఠస్కంధ ముదాహరింపఁ బడినది. యించి రామయ్య, ఆంధ్రకవి:-పోసిరాజు రామయ్యయు నీతఁడు నొక్క డో ? వేఱో , ఈతఁడు ప్రాచీనకవులను మాత్రమే స్తుతియించినాఁడ . అందు, "ఛందోనిబంధనదాతురీఛారేయ వాగ్దామువేములవాడ భీము" సనుచున్నాఁడు - లాక్షణికులు గూడఁ బెక్కురు కవిజనాశ్రయము వేములవాడ భీమకవి రచితమని యుదాహరించెదరు.

‘‘క. చను సుత్తమగండాఛ, ర్వణహనుమదనంతసకవిరాక్షసజయదే
వనుత శ్రీధరగోళ, భనీలకంఠాది భీమసచ్ఛందఁబుల్

అనఁగా “దశ విధచ్ఛందములు," రంగరాట్ఛందస్సు,

ఈ విషయము మిక్కిలి సందిగ్ధముగానేయున్నది. భీమక వియే రచియించి కోమటియగు మల్లియ రేచని పేరఁ బ్రకటించెనని నానుడి ! ఆకోమటి మిక్కిలిగా నందుఁ బ్రంసించుకొనబడినాఁడు వేములవాడ భీమకవియో కోమట్లను బడఁదిట్టినాడు; వినుఁడు.

ఉ "కోమటి కొక్కటిచ్చి పదిగొన్నను దోసములేద, యింటికిన్
సేమమెఱిం చిచ్చిడినఁ జెందద పాపము; వానినేప్పుడే
నేమఱుపాటున న్మఱి నేమియొనర్చిన లేద దోస; మా
భీమునిలింగ మాన క విభీమునిపల్కులు నమ్మియుండుఁడీ.

చ, గొనకొని మర్త్యలోక మునఁ గోమటి పుట్టఁగఁ బుట్టెఁ దోన బొం
కును గపటంబు లాలసయుఁ గుత్సిత బుద్ధియు రిత్తభక్తియున్
సనుపరిమాటలున్ బర ధనంబును గ్రక్కున మెక్కఁజూచుటల్
కొనుటలు నమ్మటల్ మటియు గొంటుదనంబును మూర్ఖవాదముల్ ,

వేములవాడ భీషున యిట్లు సెప్పగా వేడొకకవి దాని నిట్లు ప్రశం సంచినాఁడు.