17
తిమ్మయ్య, కుంటముక్కల :- ఈతని శైవాచార సంగ్రహము1[1]దొరకి యున్నది.
త్రిపురాంతకుఁడు, రావిపాటి :. ఈ కవీశ్వరునికృతి 2[2] యుదాహర ణము మాత్రమే సమగ్రముగా దొరకియున్నది. తారావళి, అంబికాశతకము, పేమాభిరామము దొరకలేదు. క్రీడాభిరామమునకు సంస్కృతమైన ప్రేమాభి రామమును రచియించుటచేతనే యేమో యీతనిఁ గూచిరాజు - ఎఱయి యిట్లు తన కొక్కోకమునఁ బేర్కొన్నాఁడు.
“సి-గీ, ముని సనత్కుమారు ధనదతనూభవు
నాశ్వినుల జయంతు నభిన తించి
పృథివి రావిపాటి త్రిపురాంతకాదిశృం
గారకవుల నెల్ల గౌరవించి."
ప్రేమాభిరామము శృంగారకావ్యమే యగును గదా ! రామకృష్ణకవిగారు
త్రిపురాంతకు (డు మదనవిజయ మను కామశాస్త్ర గ్రంథమును ( వాత్స్యాయన
సూత్రఘులకుఁ దెలుఁగఁట) రచియించెనని వ్రాసినారు. [3]3 దొరకినంతవఱకుఁ బరి
కింపఁగా నీతనీయాంధ్రకవిత యతిప్రశస్తముగా నున్నది. ఈ క్రింది రెండు
పద్యములు గూడ సంబికాశతకమందలివి.4[4]
“చ. బెడఁ గగురత్నదర్పణముఁ బేరిన వెన్నెల పోసి నిచ్చలుం
దుడుపక పాలసంద్రమునఁ దోఁచి సుధాకరుమేనికందుఁబోఁ
గడుగక నేరెటేట సితకంజము ముంపక నై జకాంతి తోఁ
దొడరినఁ దల్లి ! నీ మొగముతో సరిపోల్పఁగఁ జాలు నంబికా !
ఉ. టెప్పలబోరుఁదల్పు లిసిటింతలు వాటెడుచూపుఁ గుంచియం
ద్రిప్పి తళుక్కనం దెఱచి తిన్న నిమోమునఁ గాయు వెన్నెలల్
1.
2.
3.
4.
- ↑ ప్రాచ్యలిఖిత పుస్తకశాలలో ;
- ↑ తంజాపూరుపుస్తకశాలలో నున్నది. శ్రీ రామకృష్ణ కవిగారు ముద్రించినారు
- ↑ క్రీడాభిరామ వీఠికాదులు చూడుఁడు.
- ↑ ప్రయోగరత్నాకరమునం దున్నవి. మా. రా, కవిగారు ఉదాహరణ పీఠికలో గూడ నుదాహరించినారు. మొదటిపద్యము సర్ధ మసందర్భముగా నున్నది. తుడువఁగ, కడుగఁగ, ముంపఁగ, తొడరిన తల్లి, అని యుండఁగూడును.