ఈ పుట అచ్చుదిద్దబడ్డది

బయలుపై నే మాడ్కిఁ బదిలమైనది యొక్కొ కొమరారు నవహేమ కుంభయుగళి?
మొలకచందురుమీఁద నిలిచి యే క్రియనొక్కొ బలసి క్రాలెడు నోలి నలఁతియిరులు?
గీ. జగతి నరు దనఁదొడలును జఘనతలము
నాభియును నారు నడుముఁజన్గవయు నుదురు
నలకములయొప్పు వర్ణింప నలవియగునె
రాజబింబాస్య చెలువంబు రాజతనయ! (ఆం) 557

మ. కనియెన్ దుర్గమ సానురింఖణ తురంగగ్రావణా నూరువున్
దిననాథద్యుతి పుంజభంజనల సద్దీపితిచ్ఛటాచారువున్
కనదభ్రంకషతుంగశృంగ విహరద్గాయన్మరుద్భీరువున్
దనుజారిస్థితి భద్రదారువును దద్వందారువున్ [?] మేరువున్.[1] (ఆం) 558

మహాస్రగ్ధర. కని రుగ్రగ్రాహనక్రగ్రహణ ఘుమఘుమాకార కల్లోల డోలాం
చన బద్ధాందోళకేళీ సరభసఫణభృచ్చారుజూటాగ్ర జాగ్ర
ద్ఘన రత్నోదంచదత్యుత్కటకుటిల మయూఖచ్చటాటోప మిథ్యా
జనితౌర్వారంభ శుంభత్సలిల నివహ నిస్తంద్రు రత్నాకరేంద్రున్.[2] (ఆం) 559

గీ. కన్నుఁగవఁ గాటుకయు బోటికచ్చడంబు
భూతి రుద్రాక్షమాల త్రిపుండ్రకములు
ధవళదంతవాటికాస్థాపుటములు
నంగవికృతియు సజ్జాతిభృంగిరిటికి. (ఆం) 560

చ. కమలిని యించుకేని యెసఁగం గనుమూయదు లోన నవ్వెడిం
గుముదిని రాగపల్లవిత కోమలశీతలధాముఁ డంబరాం
తముఁ గబళింపఁ జొచ్చెనని తాను నవాంగనవోలె సిగ్గునన్
శమితము సేసె నల్లన నిశాసతి ప్రొద్దను గేహదీపమున్. (ఆం) 561

చ. కలఁగిన పూఁతయున్ నుదుటికస్తురనంటిన కుతలంబులున్
బలసినయూర్పులున్ గలిగి పాన్పుఁ గరంబున నూఁది మూఁపు నం

  1. ఎఱ్ఱనరచన [హరివంశము?]
  2. నాచన సోముని ఉత్తరహరివంశము పోల్కి.