ఈ పుట అచ్చుదిద్దబడ్డది

శా. ఆ రాజాస్యలు గాంచి రయ్యెడ సముద్యల్లోల కల్లోల సం
చారోద్ధూత నవీనఫేన దరహాసస్ఫారమున్ నిర్జరా
హార శ్రీకరవారిపూరము ఖగవ్యాపార విస్తారమున్
బారావార గభీర మున్నత మహాపారంబుఁ గాసారమున్. (ఆం) 551

చ. ఇరవున గోపురాగ్రముల నెత్తిన కేతనవాత పూరణో
త్కరము వియన్నదీజలము గ్రాయుచు వాతహతిం దదంబు శీ
కరములఁ జల్లుటన్ జలదకాలముగాఁ గొనియాడు నెప్పుడున్
బురిని నెముల్ ప్రమోదగతి భూరిహిరణ్మయ హర్మ్యవేదులన్. (ఆం) 552

ఉ. ఈఁకలు నల్లనైనవని యెంచి విశాల రసాలశాఖ యు
త్సేకముతోడ నెక్కి వికసించి ఫలంబులు నీవు మేయుచున్
గోకిల రీతినుందు ననుకొన్నను నంటివి కాక పాపపుం
గాకమ! నీకు నమ్మధురగానము గల్గునే యెన్ని వల్కినన్! (జ) 553

గీ. ఉదయరాగ మించించుక యుజ్జగించి
నిండుచంద్రుండు కన్నులపండువయ్యె
ధావనాంతర స్నిగ్ధ దాక్షిణాత్య
రాజశుద్ధాంత దంతవజ్రముల కాంతి.[1] (ఆం) 554

ఉ. ఏచి తలిర్చి గొప్పలగు నెఱ్ఱనిపూవులతోడి బూరుగున్
రాచిలు కర్థిఁజేరి మధురంపు ఫలంబుల నాస సేసినన్
జూచి నిరాశయై చనిన చొప్పగు నల్పుల నాశ్రయించినన్
... .... .... ... ... (జ) 555

గీ. కడలుఁజేతు లార్చుచు ఫేనఘనత రాట్ట
హాస రుచితోఁ బ్రవాళజటాలివిచ్చి
యౌర్వశిఖి ఫాలలోచన మనఁగ సింధు
వమలుఁ దాండవ మాడెడు హరునిఁ బోలి.[2] (?) 556

సీ. కదళికా కాండయుగ్మము మీఁద నెట్టొకో నిద్దంపుఁబులినంబు నెలవుకొనియె?
జలజాకరంబులో మొలచి యే గతి నొక్కొ తోఁతెంచె మవ్వంపు ధూమరేఖ?

  1. చూ. భీమఖండము 2.43
  2. ప్రథమముద్రణమున నీ తుది రెండుపంక్తులందు చుక్కలున్నవి.