ఈ పుట ఆమోదించబడ్డది

14


సంస్కృతంబున నొప్పారు చారుచర్యఁ
     దెనుఁగు సేసేఁ దా నెంతయుఁ దేఁటపడఁగ.

ఉ. రాజహితంబుపొంటె సుకరంబుగ వైద్యసునీతిధర్మని
     ర్వ్యాజపథానుసారమధురంబుగ నిర్జరభాషఁ దొల్లి యా
     భోజునిచేతఁ జెప్పఁబడి పొల్పగు నీకృతి నూత్నసత్కళా
     భోజుఁడు మంత్రియప్పన ప్రబుద్ధుఁడు చేసెఁ దెనుంగు బాసఁగన్.

ఎఱ్ఱయ, కూచిరాజు :-- సకలకథానిధాన మని,[1] కొక్కోకమని యీతని కృతులు రెండున్నవి. కొక్కోకము సర్వత్ర దొరకునదియే ఇందలి సకలపురాణసారము మూఁడవది. ఇది యింతదనుక లభింపలేదు. సకలకథానిధానపు బీఠికలో నిది పేర్కొ నఁబడినది. చూడుఁడు.

'సీ. శ్రీవత్సగోత్రవారిధిపూర్ణశీతాంశుఁ డగుకూచమంత్రికి నాత్మజుఁడవు,
     వివిధాష్టభాషాకవిత్వవాచాప్రౌఢిఁ బూర్వకవీంద్రులఁ బోలినాఁడ,
     వఖిలపురాణేతిహాసకావ్యస్మృతిచయము రచించిన చారుమతివి,
     మాపినతండ్రి యౌ మల్లమంత్రికిని గొక్కోకంబు సెప్పినకోవిదుఁడవు,
గీ. రసికు లభినుతి సేయఁ బురాణసార
     మనుపమంబుగ నాకిచ్చినట్టి ప్రోడ
     వట్లుగావున నొకటి నిన్నడుగఁదలఁచి
     యిచ్చటికిఁ బిల్వఁబంచితి నెఱ్ఱనార్య'

కేతనప్రెగడ: - ప్రయోగరత్నాకరమందు “భాస్కరుని కేతన కాదంబరి" అని కలదు దశకుమారచరిత్రకర్త మ్రానయ కేతన కావున నాతఁడు వేఱగును. తిక్కన సోమయాజి పితృవ్యుఁ డొక కేతన కలఁడు. అతని తండ్రి భాస్కరుఁడే. దశకుమారచరిత్రమం దీవిషయము గానవచ్చుచున్నది. అందలి వర్ణనమునుబట్టి చూడఁగా నా భాస్కరునికేతనయుఁ గవిగా నెఱుగఁబడుచున్నాడు.


  1. ఇది ప్రాచ్యలిఖితపుస్తకశాలలో గ్రంథపాతములతో నున్నది. ముద్రింపదగిన యుత్తమకావ్యము. ప్రత్యంతరము దొరకలేదు.