పుట:Peddapurasamstanacheritram (1915).pdf/33

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

బుధిపర్యంతధరిత్రియేలె బుధులన్బోషించె సంపూర్ణ
దర్మధనుండైనుతికెక్కె వత్సవాయ తిమ్మక్ష్మాపతీంద్రుడిల్.

ఈ తిమ్మరాజుగారు పెద్దపురమును బరిపాలించుచుండగా పిఠాపురమును తెనుగురాయనింగారిమనమడును చంద్రారాయనింగారి కొమారుడునగు మాధవరాయనింగారు పరిపాలన సేయచుండిరి. ఆమాధవరాయనింగారు తమ బంధువర్గములో జేరిననారసింహరాయనింగారి కొమార్తెయయిన రమణయ్యగారిని పరిణయము సేసికొనిరి. ఈ పిఠాపురపురావువారే ఇంతకుగొంతకాలముక్రిత మీరారసింహరాయనింగారికి జూపల్లె ముఠా నిచ్చియునిడిరి. శ్రీపీఠికాపురాధీశు లగు రావువంశీయులకును పెద్దాపురపు వత్సవాయవారికిని మైత్రి యుండినందున, ఒకానొకప్పుదు నారసిహరాయనింగారు పిఠాపురమునకు బోవుచు పెద్దాపురము వచ్చినందున శ్రీ తిమ్మరాజుగారు రమణయ్యగారికని చెప్పికొన్నిగుర్రములను ఇంకను ఇతరబహుమానములను చేసిరి. కాని యానారసింహరాయనింగారు తమకొమార్తె పిఠాపురముననుదురనియు, ఆమెకు పసుపుకుంకుమక్రింద శాశ్వత ముగ జౌగులాగున నేదైన నేర్పాటుచేయవలసినదని గోరగా, పిఠాపురపువారికిని తమకుగల మైత్రిబాటించి, అంతవరకు తమసంస్థానముక్రింద జరుగుతున్న చాళుక్యభీమవరము (చామర్లకోటవద్దది) గ్రామమును రమణయ్యగారికి పసుపుకుంకుమ నిమిత్తమిచ్చివేసినారు. ఈప్రకారము వత్సవాయతిమ్మరాజుగారమితో దారసాహసములంగలిగి, చేతికడ్డులేకుండ దానముసేయుచు, దనువితరణముచే శిబికర్ణులదలపించుచు వన్నెయువాసియుం గాంచిరి.


---భాషాభిమానము కవిసన్మానము.---

ఈ తిమ్మరాజుగారు కూడ తండ్రితాతలవలెనే తాముకూడ భాషాభిమానులై కవీశ్వరౌలనాదరించి ప్రసిద్ధిచెందినవారు. రామవిలాసమును రచియించిన ఏనుగు లక్ష్మణకవీ తాతగారైన లక్ష్మణకవి తాతగారైన లక్ష్మణకవిగారు ఈయనకాలమునందేయుండి, తాము రచియించిన ద్రౌపదీపరిణయప్రబంధమును నీయనకంకితము చేసియుండిరి. ఈసంగతియే రామవిలాసములోని యీ క్రిందిపద్యమువలన దెలియగలరు.

"హరిహరపద్మజాంశభవుడైతగు నేనుగులక్ష్మణార్యుచే
సురుచిరశబ్ద భావరసకుంభరులం కృతిమాధురీ మనో
హర మగు ద్రౌపదీపరిణయంబును నుత్తమకావ్యమందె సు
స్థిరమగు కీర్తిపాం పెసగ దిమ్మనృపాలుడు ధర్మపద్ధతిల్"