ఈ పుట ఆమోదించబడ్డది

మన హృదయాలను మార్చి మనలను నూత్న మానవులనుగా తయారుచేస్తుంది. అప్పడు మనం అన్యాయాలకూ మోసాలకూ పాల్పడం. వునలోని స్వార్థం అంతరినుంది. దానివలన సమసమాజం ఏర్పడుతుంది. కనుక పౌలు బోధించిన క్రీస్తు సువార్త అన్నిదేశాలవారికీ, అన్ని కాలాలవాళ్లకూ ప్రేరణం పుట్టిస్తుంది. పేదరికంతో, అన్యాయాలతో, ఘర్షణలతో అణగారిపోతున్న భారత దేశానికి గూడ ఈ సువార్త అవసరం వుంది. పౌలు బోధలు అజరామరమైనవి.

ప్రశ్నలు
అధ్యాయం - 1

1. పౌలు చేసిన మూడు ప్రేషిత యాత్రలను వివరించండి. 2. పౌలు వ్యక్తిత్వాన్ని వివరించండి.

3. ఇప్పడు మనకు పౌలు రచనల ప్రాముఖ్యం ఏమిటి? 4. మన ప్రజలకు పౌలు జాబుల్లోని భావాలు ఎంతవరకు తెలుసు?

3

5. పౌలు క్రైస్తవులను ఎందుకు హింసించాడు?

6 డమస్కు దర్శనంవల్ల అతడు గ్రహించిన నూత్నాంశాలు ఏమిటివి?

4

7. రక్షణప్రణాళిక తండ్రినుండే - వివరించండి. 8. "పౌలు సువార్త' అంటే యేమిటి?

5

9. దేవుడు నరులను నీతిమంతులను చేయడం అంటే యేమిటి?

10. రక్షణం అనే భావాన్ని వివరించండి. 11. నరులు దేవునితో రాజీపడ్డం అనేభావాన్ని వివరించండి.